Begin typing your search above and press return to search.

షారుక్ ఇంట సాజిద్ కారు మిస్ట‌రీ వీడింది ఇలా!

By:  Tupaki Desk   |   24 Oct 2021 5:01 AM GMT
షారుక్ ఇంట సాజిద్ కారు మిస్ట‌రీ వీడింది ఇలా!
X
షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో చిక్కుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టు ప‌రిదిలో ఉంది. కేసుపై విచార‌ణ‌ సాగుతోంది. అయితే కుమారుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవ‌డంతో షారుక్ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. ఇటీవ‌లే కుమారుడిని చూడ‌టానికి నేరుగా జైలుకెళ్లి క‌లిసొచ్చారు. ఆ స‌మ‌యంలో ఆర్య‌ని అలా చూసి ఎంతో కుమిలిపోయారు. ఈ నేప‌థ్యంలో షారుక్ ని ప‌రామ‌ర్శించ‌డానికి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఇంటికి వెళ్తున్నారు. ఆయ‌న‌కు బాగా కావాల్సిన వాళ్లంతా నేరుగా ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించి వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో న‌టుడు స‌ల్మాన్ ఖాన్..నిర్మాత సాజిద్ న‌డియావాలా కూడా త‌మ కార్ల‌లో షారుక్ ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించిన‌ట్లు తెర‌పైకి వ‌చ్చింది. అయితే తాజాగా షారుక్ ఇంటికి సాజిద్ న‌డియావాలా వెళ్ల‌లేద‌ని తేలింది. కేవ‌లం ఆయ‌న కారు మాత్ర‌మే షారుక్ ఇంటికెళ్లింద‌ని తెలిసింది. సాజిద్ న‌డియావాలా కారు షారుక్ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో ఇలాంటి ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. అయితే సాజిద్ కారును స‌ల్మాన్ ఖాన్ కి రైట్ హ్యాండ్ గా ఉండే పీపీ ఆకా ప్ర‌శాంత్ కొనుగోలు చేసారుట. కారు తాలుకా రిజిస్ట్రేష‌న్ అంతా పీపీ పేరుమీద‌కే త‌ర్జుమా అయింది. కానీ గ‌తంలో ఇదే కారును సాజిద్ వినియోగించ‌డంతో అత‌నే షారుక్ ఇంటికి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

వాస్త‌వానికి షారుక్ ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లింది స‌ల్మాన్ అత‌ని స‌న్నిహితుడు పీపీ ఆకా ప్ర‌శాంత్ అని తాజాగా ఖ‌రారు అయింది. దీంతో షారుక్ ఇంట సాజిద్ అన్న‌ప్ర‌చారంపై ఓ క్లారిటీ దొరికింది. అయితే ఇప్ప‌టికే సాజిద్ .. షారుక్ ఖాన్ కి ఫోన్ చేసి పరామ‌ర్శించారుట‌. ఎప్ప‌టిక‌ప్పుడు షారుక్ కి ఫోన్ ట‌చ్ లో ఉంటూ అన్ని ర‌కాలుగా ముందున్న‌ట్లు స‌మాచారం. స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా సాజిద్ న‌డియా వాలా నిర్మాత‌గా ప‌ర్హాద్ సంజీ ద‌ర్శ‌క‌త్వంలో ఓచిత్రం తెర‌కెక్క‌నుంది. ఈచిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్భంగా ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్య‌న్ ఖాన్ వ్య‌వ‌హారంతో షారూక్ ఇత‌ర ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్ట‌లేని ప‌రిస్థితి ఉంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలోనూ అత‌డు ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.