Begin typing your search above and press return to search.

ఒక్క తెలుగు సినిమా కూడా లేదా.. ఛా!!

By:  Tupaki Desk   |   2 Nov 2016 10:54 AM IST
ఒక్క తెలుగు సినిమా కూడా లేదా.. ఛా!!
X
నవంబర్ 20 నుంచి గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 47వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ పనోరమా సెక్షన్ లో మొత్తం 22 సినిమాలను ప్రదర్శిస్తుండగా.. ఇందులో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు దక్కలేదు. ఒక్క బాహుబలికి తప్ప .. అనే పాయింట్ ని అండర్ లైన్ చేసుకోవాలి.

బాహుబలి ది బిగినింగ్ కి చోటు లభించడానికి ప్రధాన కారణం.. 63వ జాతీయ ఫిలిం అవార్డులు 2015లో.. ఈ చిత్రం బెస్ట్ మూవీగా నిలవడమే. అంటే బాహుబలి ఎంట్రీ డైరెక్ట్ అన్నమాట. ఎలాంటి పోటీ లేకుండానే.. నేరుగా స్క్రీనింగ్ కి ఎంపికైంది. ఇది కాకుండా.. 22 సినిమాలను ఎంపిక చేస్తే.. అందులో ఒక్క తెలుగు మూవీ కూడా లేకపోవడం బాధాకరమే. సంస్కృత చిత్రం 'ఇష్టి'తో స్క్రీనింగ్ ప్రారంభం కానుందంటూ ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు.

దేశవ్యాప్తంగా 230 ఎంట్రీల నుంచి పరిశీలించి.. అందులో బెస్ట్ అయిన 22ను ఎంపికచేశామంటున్నారు సీనియర్ నిర్మాత కం జ్యూరీ మెంబర్ అయిన సీవీరెడ్డి. తెలుగులో కమర్షియల్ సినిమాలు తీసేందుకే నిర్మాతలు చూస్తారని.. మంచి సినిమాలు తీయాలనే ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లభించకపోవడమే కారణమన్న ఆయన..మహారాష్ట్ర ప్రభుత్వం మంచి సినిమాలకు రూ. 50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకుంటేనే.. ఇతర భాషలతో పోటీ పడే సినిమాలు ఇక్కడ వస్తాయని తేల్చేశారు సీవీ రెడ్డి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/