Begin typing your search above and press return to search.

శ్రీజ పెళ్ళి ఎవరైనా షూట్‌ చేస్కోవచ్చు

By:  Tupaki Desk   |   23 Feb 2016 2:08 PM GMT
శ్రీజ పెళ్ళి ఎవరైనా షూట్‌ చేస్కోవచ్చు
X
ఈ మధ్య తెలుగులో ఛానల్స్ హడావిడి ఎక్కువైపోయింది. టీఆర్పీ రేటింగుల కోసం లైవ్ టెలికాస్ట్ లంటూ నానా హంగామా చేస్తున్నారు. సినిమా ఆడియో ఫంక్షన్ల నుంచి ప్రతీ ప్రెస్టీజియస్ ఈవెంట్ కు టీఆర్పీల హడావిడి, టీవీ ఛానళ్ల లైవ్ టెలికాస్ట్ హంగామా ఎక్కువైపోయింది. ఎక్స్ క్లూజివ్ రైట్స్ కోసం పోటీ పడి మరీ రేట్లు చెల్లించేందుకు ప్రధాన ఛానళ్లు వెనకాడ్డం లేదు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఇంకా ముహూర్తం, వేదిక ఫైనల్ చేయలేదు కానీ... ఛానల్స్ మాత్రం లైవ్ టెలికాస్ట్ చేస్తామంటూ హడావిడి స్టార్ట్ చేసేశాయి. తమకు ఎక్స్ క్లూజివ్ గా రైట్స్ ఇవ్వాలంటూ బేరాలు కూడా పెడుతున్నాయంటున్నారు. అయితే.. పెళ్లి విషయంలో కమర్షియల్ గా ఆలోచించి రైట్స్ అమ్ముకునేందుకు చిరు ఫ్యామిలీ సిద్ధంగా లేదు. అసలింతవరకూ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా తమ ఇంట్లో వేడుకలను మార్కెటింగ్ యాంగిల్ లో చూడలేదు. హిందీ ఛానల్స్ లో ఉన్న ఈ తరహా కల్చర్ ని ఇక్కడ కూడా తెచ్చేందుకు ఛానల్స్ ట్రై చేస్తున్నాయి.

అయితే ఈ విషయంలో మన స్టార్ హీరోలు బాగా ఉదార స్వభావం ఉన్నవాళ్లే. పెళ్లి రోజున ఏ ఛానల్ అయినా సరే.. వేదిక బయట కెమేరాలు పెట్టుకుని షూటింగ్ చేసుకోవచ్చు. అలాగే.. రిసెప్షన్ వంటి ప్రోగ్రామ్స్ ని నలుగురైదుగురు కెమేరాలతో ఒక ఓబీ వ్యాన్ పెట్టుకుని.. అందరూ తప్పనిసరిగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీజ పెళ్ళిని కూడా మేబీ ఇలాగే షూట్‌ చేస్కోవాల్సి ఉంటుందట. రైట్లు గియిట్లు అమ్మడం వంటివి ఏమీ లేదట.