Begin typing your search above and press return to search.

టీకా వేయ‌కుండా డాక్ట‌ర్ తోడు లేకుండా షూటింగుల్లేవ్!

By:  Tupaki Desk   |   2 Jun 2021 10:00 AM IST
టీకా వేయ‌కుండా డాక్ట‌ర్ తోడు లేకుండా షూటింగుల్లేవ్!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ క‌ల్లోలం గురించి తెలిసిందే. సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ముప్పు మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యింది. ఓవైపు వ్యాక్సినేష‌న్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంటే ప్ర‌జ‌ల్లో భ‌యాలు త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న ప్ర‌చారం కూడా మ‌రింత భ‌య‌పెడుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఆన్ లొకేష‌న్ షూటింగులు చేయాలంటే స్టార్ల‌కు అయినా ఒణుకు గ్యారెంటీ. సెకండ్ వేవ్ లో దాదాపు రెండు డ‌జ‌న్ల మంది ప్ర‌ముఖ స్టార్లు సెల‌బ్రిటీలు క‌రోనా సోకితే చికిత్సతో కోలుకున్నారు.

అందుకే ఇప్పుడు షూటింగుకి వెళ్లాలంటే ముందుగా స్టార్ హీరోలంతా త‌మ వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్ ని కూడా సంప్ర‌దిస్తున్నారు. ఆన్ లొకేష‌న్ కి నేరుగా వారిని పిలిచి బ‌స ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్ అన్నాథే సెట్స్ లో డాక్ట‌ర్ అందుబాటులో ఉంటున్నారు. క‌రోనాతో సంబంధం లేకుండా ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి కాబ‌ట్టి ఈ జాగ్ర‌త్త త‌ప్ప‌దు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ సైతం ఇటీవ‌ల డాక్ట‌ర్ అవ‌సరాన్ని గ్ర‌హించార‌ట‌. స‌ర్కార్ వారి పాట షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతోంది కాబ‌ట్టి త‌న‌కంటూ ఒక డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌ను ప్లాన్ చేశార‌ట‌.

ఆచార్య‌- రాధేశ్యామ్- పుష్ప ఇలా ప‌లు చిత్రాలు సెట్స్ కెళ్లాల్సి ఉంది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు చేయాల్సి ఉంది. దాదాపు పాతిక పైగా సినిమాలు కీల‌క షెడ్యూళ్ల‌లో అడుగుపెడుతున్నాయి. అందువ‌ల్ల లొకేష‌న్ లో డాక్ట‌ర్ల ఏర్పాటు టీకా వేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేశార‌ట‌. ఎవ‌రికి వారు చిత్ర‌బృందాలు త్వ‌ర‌త్వ‌ర‌గా త‌మ‌తో లొకేష‌న్ కి వ‌చ్చేవాళ్లంద‌రికీ వ్యాక్సినేష‌న్ ని పూర్తి చేయించే ప‌నిలో ఉన్నార‌ని తెలిసింది. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు ఉన్నాయి కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ తో అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌న్న బ‌ల‌మైన ప్లాన్ హీరోల‌కు ఉంది. ప్ర‌యివేట్ గా వ్యాక్సినేష‌న్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి కాబ‌ట్టి వాటిని ధ‌ర ఎంతైనా కొనేసి లొకేష‌న్ లో వారంద‌రికీ వేయించే ప్లాన్ లో ఉన్నార‌ట‌. ఆన్ లొకేష‌న్ కి వెళ్లాక ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుందిట‌.

మొద‌టి వేవ్ లో అజాగ్ర‌త్తగా ఉన్నందుకు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. అందుకే ఇక‌పై ఇన్ని జాగ్ర‌త్త‌లు కావాల‌నుకుంటున్నార‌న్న‌మాట‌.