Begin typing your search above and press return to search.

ఫైవ్ స్టార్ హోటళ్ళలో కబాలి చూడలేం

By:  Tupaki Desk   |   21 July 2016 5:00 PM IST
ఫైవ్ స్టార్ హోటళ్ళలో కబాలి చూడలేం
X
అబ్బే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకెందుకు. ఒక సినిమా రిలీజుకు ముందు ఎంత హైప్‌ వచ్చినా కూడా.. రిలీజు తరువాత ధియేటర్లో ఆ హైప్‌ ఎంతవరకు నుంచుంటుంది అనేదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు ''కబాలి'' విషయంలో ఎన్నో రికార్డులు నెలకొల్పబడుతున్నాయి అని మనం అనుకుంటాం కాని.. ఇక్కడ చూస్తే అందులో కొన్ని అసలు జరగట్లేదు కూడా.

బెంగుళూరుకు చెందిన కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్ళు.. చక్కగా వైన్ అండ్ డైన్ చేస్తూ కబాలి సినిమాను చూడండి అంటూ ఒక గోల్డెన్ ఆఫర్‌ ఇచ్చాయి. అంటే హోటల్లో స్ర్కీనింగులు చేస్తుంటే.. మనం తింటూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చనమాట. టిక్కెటు ధరను 2 వేల వరకు పెట్టాయి. ఇది సెన్సేషనల్ రికార్డు అన్నారు అభిమానులు. అయితే ఈ యవ్వారంతో ధియేటర్ ఓనర్లకు మండిపోవడంతో.. ఒకవేళ ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళలో సినిమాను వేస్తే మాత్రం.. మేం ధియేటర్లలో సినిమాను ఆపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చేశారు ఎగ్జిబిటర్లు. వారు అంతమాట అనేశాక ఇంకా చేసేదేం ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తలపెట్టిన ఇలాంటి ఖరీదైన స్ర్కీనింగులన్నీ రద్దు చేయాల్సి వచ్చింది.

ఇకపోతే ఎలాగో ఫైవ్ స్టార్ హోటళ్ళలో టిక్కెట్లు కొనుక్కున్నాం కదా అని కాలుమీద కాలేసుకుని కూర్చున్న బాబులందరూ.. ఈ డెసిషన్ తో బలైపోయారు. ఇప్పుడు టిక్కోట్ల కోసం లబోదిబోమంటూ పరుగులు తీస్తున్నారు. కబాలి డా!!