Begin typing your search above and press return to search.

పెద్ద హీరోలు సమంతను దెబ్బేశారా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 11:01 AM IST
పెద్ద హీరోలు సమంతను దెబ్బేశారా?
X
సినిమాల్లోకి ఎంట్రీ నుంచి ఇప్పటివరకూ తనదైన మార్క్ ను చూపించే నటిగా సమంతను చెప్పుకోవాలి. తన మనసుకు నచ్చింది చేయటం ఆమెకు అలవాటే. మరే నటికి లేని రీతిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్న సామ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. పెళ్లి తర్వాత నటనకు పెద్దపీట వేసేలా పాత్రల్ని ఎంచుకుంటూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటున్న సమంతకు పెద్ద హీరోల కారణంగా ఊహించని దెబ్బ పడినట్లుగా చెబుతున్నారు.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఓకే చెబుతూ.. తనలోని నటిని బయటకు తీస్తున్న సమంత తాజాగా చేసిన చిత్రం 96 రీమేక్. తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ తో జతకట్టిన సామ్ కు ఈ మూవీ కచ్ఛింగా ప్లస్ అవుతుందని అంటున్నారు.

96 తమిళ సినిమాకు దర్శకుడైన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే.. డిసెంబరులో పెద్ద హీరోల సినిమాలు వరుస పెట్టటం ఈ సినిమా విడుదలకు దెబ్బ పడేలా మారిందంటున్నారు.

డిసెంబరు మూడో వారంలో బాలయ్య రూలర్.. సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజూ పండుగే అంటూ రెండు సినిమాలు రావటం.. వారం గ్యాప్ లో డిస్కో రాజా వస్తుండటంతో సామ్ సినిమా విడుదలకు డేట్ దొరకని పరిస్థితి. ఈ జనవరిలోనూ వరుస పెట్టి సినిమాలు వస్తున్న వేళ.. 96కు చోటు లభించేది లేని పరిస్థితి. ఇలా.. పెద్ద హీరోల పుణ్యమా అని సామ్ సినిమాకు దెబ్బ పడటంతో.. అనుకున్న వేళకు సినిమా రిలీజ్ కాక ఆమె అడ్డంగా బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.