Begin typing your search above and press return to search.

చియాన్‌ కి భ‌య‌ప‌డి నిర్మాత‌లు జంప్‌

By:  Tupaki Desk   |   22 Nov 2015 3:00 PM IST
చియాన్‌ కి భ‌య‌ప‌డి నిర్మాత‌లు జంప్‌
X
చియాన్ విక్ర‌మ్ ప్ర‌స్తుతం ఏ సినిమాలో న‌టిస్తున్నాడు? త‌మిళ్‌ లో 10 ఎంద్రాతుకుళ్ల ఫ్లాపైన త‌ర్వాత అతడి స్టాట‌స్ ఏంటి? డీటెయిల్స్‌ లోకి వెళితే ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్స్ ఎన్నో తెలిశాయి. వాస్త‌వానికి 10ఎంద్రాతుకుళ్ల సినిమా టైమ్‌ లో అత‌డితో సినిమా తీసేందుకు స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ళైపులి ఎస్‌.థాను..రెడీ అయ్యాడు. ఆయ‌న‌ నిర్మాత‌గా అరిమానంబి ఫేం ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే అత‌డు విజ‌య్ 59 - క‌బాలీ సినిమాల్ని నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు సీన్‌ లోంచి త‌ప్పుకున్నాడు. క‌ళైపులి త‌ప్పుకున్న వెంట‌నే అయ్యంగ‌ర‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ విక్ర‌మ్‌ తో సినిమాని టేకోవ‌ర్ చేసినా ఇప్పుడు ఈ సంస్థ కూడా వెన‌కాడుతోంద‌ని స‌మాచారం. అయ్యంగ‌ర‌న్ సంస్థ కూడా వెన‌క్కి వెళ్ల‌డంతో సీన్‌ లోకి మ‌రో నిర్మాత ఎంట్రీ ఇచ్చాడు. పులి వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన శిబు ఇప్పుడు విక్ర‌మ్‌ తో సిన‌మాని టేకోవ‌ర్ చేసుకున్నాడు. శిబునే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. విక్ర‌మ్‌ తో సినిమా చేస్తున్నా. ఈ రెండురోజుల్లోనే ఇత‌ర‌త్రా వివ‌రాల్ని వెల్ల‌డిస్తాన‌ని చెప్పాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ - బింధుమాధ‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఏదైతేనేం ఒక్క ఫ్లాపుతో విక్ర‌మ్ అంత‌టివాడి సీనే సితారైపోయింద‌న్న సంగ‌తిని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. స‌క్సెస్ ఏదైనా చేస్తుందిక్క‌డ‌. అది లేక‌పోతే ఎంత‌టివాడికైనా క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇప్పుడ‌ర్థ‌మైందా?