Begin typing your search above and press return to search.

జస్ట్ రక్తం ఎక్కించారంతే.. బానే ఉంది

By:  Tupaki Desk   |   22 April 2017 6:49 AM
జస్ట్ రక్తం ఎక్కించారంతే.. బానే ఉంది
X
మన మీడియావరు పాత హీరోయిన్లపైన ఇష్టం గౌరవంతో వాళ్ళ గురించి చెబుతారా.. లేక అది మంచి న్యూస్ ఐటెమ్ గా ఉంటుంది అని వెతికి మరీ న్యూస్ క్రియేట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు తన గురించి అలాగే ఒక న్యూస్ రావడంతో.. ఒక పాతతరం పెద్దావిడ ఫీలైంది.

ఈ మధ్య పాతతరం స్టార్ హీరోయిన్ కృష్ణకుమారి ఆరోగ్యంపైన అటువంటి న్యూసులు వచ్చాయి. ఆవిడికి కాన్సర్ ఉంది అని ఇప్పుడు ఆవిడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని టాక్ వచ్చేసింది. అయితే అందులో నిజం లేదంటున్నారు కృష్ణకుమారి. ''అవును నాకు వయసు ప్రభావం వలన ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తక్కువైంది అంతే. రక్తం ఎక్కించారు. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నా'' అంటూ 84 ఏళ్ల అలనాటి మేటి నటి కృష్ణకుమారి పేర్కొన్నారు.

అయితే అపోలో హాస్పిటల్ లో వెరిఫై చేశాకనే ఆ న్యూస్ వేశాం అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్‌ పత్రిక పేర్కొంది. ఆవిడకు క్యాన్సర్ ఎర్లీ స్టేజిలో ఉంది కాబట్టే రక్తం మార్చారు అంటూ సదరు మీడియా చెప్పుకొచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/