Begin typing your search above and press return to search.
పార్టీకి పర్మిషన్ లేదు పుష్పా..!
By: Tupaki Desk | 24 Dec 2021 4:00 PM ISTఅల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాష్ట్రాల వారిగా భారీ సక్సెస్ మీట్స్ ప్లాన్ చేసారు.
'పుష్ప' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంలో ఇప్పటికే తిరుపతిలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. అలానే చెన్నైలో కూడా మాసివ్ పార్టీ చేశారు. ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో సక్సెస్ మీట్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు అనుమతులు రాకపోవడంతో ఈవెంట్ ని రద్దు చేశారు.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. “ఈరోజు కాకినాడలో జరగాల్సిన 'పుష్ప: ది రైజ్' మాసివ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు చేయబడింది” అని మేకర్స్ పేర్కొన్నారు. అనుమతి నిరాకరిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నప్పటికీ.. అధికారులు ఏ కారణంతో పర్మిషన్ ఇవ్వలేదనే దానిపై స్పష్టత లేదు.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులను దృష్టిలో ఉంచుకొని 'పుష్ప' ఈవెంట్ కు అనుమతి నిరాకరించి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని చాలా చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ పెట్టారు. థియేటర్లు - మాల్స్ - రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో ఆక్యుపెన్సీపై పరిమితులను అమలు పరుస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి 'పుష్ప' టీమ్ ఈ సక్సెస్ పార్టీని మరేదైనా వేదికపైకి మారుస్తుందా.. లేదా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచుతుందా అనేది చూడాలి. ఇకపోతే 'పుష్ప'పార్ట్-1 మూడు రోజుల్లో 173 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే యూఎస్ఏలో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. 2021లో ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ అని చిత్ర బృందం తెలిపింది.
కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప' సినిమానని తెరకెక్కించారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఓ కుర్రాడు.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగారు అనేదే ఈ సినిమా కథాంశం. ఇందులో 'పుష్ప రాజ్' అనే ఊర్ మాస్ డీ గ్లామర్ రోల్ లో అల్లు అర్జున్ అలరించారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ ఘోష్ - అజయ్ - శత్రు - 'పలాస 1978' ఫేమ్ జగదీశ్ - ధనుంజయ కీలక పాత్రలు పోషించారు.
ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఈ సినిమా రెండో భాగం ''పుష్ప: ది రూల్'' వచ్చే ఫిబ్రవరిలో సెట్స్ మీదకు రానుంది.