Begin typing your search above and press return to search.

అనుష్కకు ఇది బంపరాఫరే..

By:  Tupaki Desk   |   25 Jan 2018 11:00 PM IST
అనుష్కకు ఇది బంపరాఫరే..
X
ఈ రోజుల్లో కొంచెం డిమాండ్ ఉన్న సీజన్లో ఒక సినిమాను సోలోగా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం దక్కడం అరుదైన విషయమే. పెద్ద సినిమాలకు కూడా భయపడకుండా చిన్న.. మీడియం రేంజి సినిమాల్ని ధీమాగా పోటీలోకి దించేస్తున్నరోజులివి. అలాంటిది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను అసలు పోటీయే లేకుండా భారీగా రిలీజ్ చేసుకునే అవకాశం దక్కడం అరుదైన విషయం. ఈ అవకాశం ‘భాగమతి’కే దక్కింది.

కారణాలేవైనా కానీ.. రిపబ్లిక్ డే వీకెండ్లో ఏ తెలుగు సినిమా రిలీజవ్వట్లేదు. సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోయింది. గత వారం అసలు సినిమాలే లేవు. సంక్రాంతి సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఒక మంచి.. భారీ సినిమా చూడాలని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘భాగమతి’ రిలీజవుతోంది. అందుకే దీనికి బుకింగ్స్ అంచనాల్ని మించి అవుతున్నాయి.

ఈ వారాంతంలో ‘భాగమతి’కి పోటీగా వచ్చిన హిందీ సినిమా ‘పద్మావత్’.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపదనే భావిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మల్టీప్లెక్సుల వరకు ‘పద్మావత్’ హిందీ వెర్షన్ ప్రభావం ఉంటుంది. సింగిల్ స్క్రీన్ల వరకు ఇబ్బంది లేకపోవచ్చు. దీని తెలుగు వెర్షన్ కు రెస్పాన్స్ గొప్పగా ఏమీ లేదు. ఈ చిత్రం మరీ క్లాస్ గా ఉండటంతో సామాన్య ప్రేక్షకులకు రుచించడం కష్టం.

కాబట్టి సగటు తెలుగు ప్రేక్షకుడి దృష్టి ‘భాగమతి’ మీదే ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వస్తాయని భావిస్తున్నారు. మరి ఈ అడ్వాంటేజీని సినిమా ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. తెలుగుు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్లలో ఇదొకటిగా నిలిచే అవకాశముంది.