Begin typing your search above and press return to search.

ఇలాంటి రోల్ చేయడానికి ఎవరూ ముందుకు రారు

By:  Tupaki Desk   |   31 Oct 2021 4:30 AM GMT
ఇలాంటి రోల్ చేయడానికి ఎవరూ ముందుకు రారు
X
ఆనంద్ దేవరకొండ హీరోగా .. దామోదర దర్శకత్వంలో 'పుష్పక విమానం' రూపొందింది. ఈ సినిమాకి ఒక నిర్మాతగా విజయ్ దేవరకొండ వ్యవహరించాడు. ఆయన సొంత బ్యానర్ 'కింగ్ ఆ ఆఫ్ ద హిల్' కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వుంది. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కూడా సందడి చేశాడు. ఈ సినిమా వేదికపై ఆయన తనదైన స్టైల్లో మాట్లాడాడు.

'కింగ్ ఆఫ్ ద హిల్' నా ప్రొడక్షన్ హౌస్ .. ఈ బ్యానర్ పై వస్తున్న సెకండ్ సినిమా 'పుష్పక విమానం'. ఈ బ్యానరును స్థాపించడం వెనుక ఒక చిన్న ఎమోషన్ ఉంది. నేను 'పెళ్లి చూపులు' చేసేటప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉన్నా .. తరుణ్ భాస్కర్ వంటి దర్శకుడు ఉన్నా .. నిర్మాతలను గురించి మేము చాలా వెతికాము. ఎవరూ కూడా మమ్మల్ని నమ్మలేదు .. డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు. చివరికి నిర్మాతలు దొరికేసరికి మాకు ఏడాదిన్నర పట్టింది. నా దగ్గర 'అర్జున్ రెడ్డి' స్క్రిప్ట్ ఉన్నా .. సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్ ఉన్నా మాకు డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకురాలేదు.

ఫైనల్ గా సందీప్ రెడ్డి వంగా వాళ్ల ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ఆ సినిమా చేశాడు. ఈ రోజున సందీప్ రెడ్డి వంగా భారీ సినిమాలు చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేసి కొత్త వాళ్లను చాలామందిని పరిచయం చేశాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను సక్సెస్ అయితే .. నా స్థాయికి తగినట్టుగా ఇలాంటి స్క్రిప్ట్ లు .. దర్శకులు దొరికితే ప్రోత్సహించాలని అనుకున్నాను. అందుకోసమే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సినిమా దర్శకుడు దామోదర కూడా తరుణ్ భాస్కర్ .. సందీప్ రెడ్డి వంగా మీటర్ కి చెందినవాడే. 'లై ఈఫ్ బ్యూటిఫుల్' సినిమా నుంచి ఆయన నాకు తెలుసు. నేను అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, దామోదర రైటింగ్ డిపార్ట్మెంటులో పనిచేస్తూ ఉండేవాడు. ఈ రోజున ఆయన సినిమాను నేను ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్క్రిప్ట్ డాడీకి .. ఆనంద్ కి నచ్చింది. ఒక టీచరు .. పెళ్లి చేసుకోవాలనుకోవడం .. హనీమూన్ కి వెళ్లాలనుకోవడం .. పెళ్ళాం లేచిపోవడం .. తానే తన్నులు తినడం .. ఇలా నడుస్తుంది కథ. ఇలాంటి పాత్రలు చేయడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. కానీ ఆనంద్ వచ్చి నేను చేస్తాను అన్నాడు.

ఈ సినిమాలో సునీల్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. 'కలర్ ఫొటో' సినిమా మాదిరిగానే ఈ సినిమాలోను మంచి వెయిట్ ఉన్న పాత్రను చేశాడు. మిగతా నటీనటులంతా కూడా చాలా అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.