Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు కనిపించడం లేదే

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:05 AM GMT
మెగా అల్లుడు కనిపించడం లేదే
X
గత ఏడాది ఎంతో ఆర్భాటంగా లాంచ్ అయిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత వచ్చి ఏడాది దాటేసింది. ఊహించని విధంగా అది డిజాస్టర్ కావడంతో రెండో ప్రాజెక్ట్ మొదలుపెట్టడంలో కొంత టైం తీసుకున్న ఇతగాడు చిరు సలహాల మేరకు హడావిడి లేకుండా లైమ్ లైట్ కు దూరంగా ఉన్నట్టు సమాచారం. పులి వాసు దర్శకత్వంలో అప్పట్లో తన కొత్త సినిమా మొదలుపెట్టుకున్న కళ్యాణ్ దేవ్ ఇంతకీ దాని రెగ్యులర్ షూట్ లో ఉన్నాడా లేడా అనే సమాచారం కూడా లేదు.

హీరోయిన్ విషయంలో కొంత సందిగ్దత నెలకొందని స్క్రిప్ట్ ని మరోసారి రీరైట్ చేస్తున్నారని ఇలా ఏదేదో ప్రచారం జరిగింది. కాని మీడియాకు మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్ డేట్స్ అందలేదు. ఇంకొన్నాళ్ళు ఈ సైలెన్స్ తప్పదట. మరో విశ్వసనీయ సమాచారం మేరకు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం బాగా గుబురు గెడ్డం పెంచుతున్నాడట. ఆ లుక్ ని బయట పెట్టకూడదనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

షూటింగ్ కూడా జరుగుతోందని ఫినిషింగ్ వచ్చే దాకా మౌనంగా ఉండి ఆపై రెగ్యులర్ గా ప్రమోషన్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నారట. ఇటీవలే తండ్రైన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకుని సరిదిద్దుకునే పనిలో పడ్డట్టు టాక్. ఎంత మెగా కాంపౌండ్ హీరో అయినా అది ఎంట్రీ వరకే పనికొస్తుందని గ్రౌండ్ లోకి వెళ్ళాక ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలనీ అతనికి తెలియంది కాదు. అందుకే ఇంకొంచెం లేట్ అయినా సాలిడ్ సబ్జెక్టుతో వచ్చే ప్లాన్ లో ఉన్నాడట