Begin typing your search above and press return to search.

గద్దలకొండ పాపలకు కొత్త ఆఫర్లేవీ?

By:  Tupaki Desk   |   4 Nov 2019 10:54 AM IST
గద్దలకొండ పాపలకు కొత్త ఆఫర్లేవీ?
X
కొంతమంది డైరెక్టర్ల సినిమాలో నటిస్తే చాలు హీరోయిన్లకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. హరీష్ శంకర్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు అలానే బ్రేక్ లభిస్తుంది. గతంలో ఇది ఎన్నోసార్లు ఋజువయింది. శృతి హాసన్ ను పూర్తిగా ఇనుప కాలు అనే రోజుల్లో 'గబ్బర్ సింగ్' తో దశ తిరిగింది. ఆ తర్వాత శృతి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 'డీజె -దువ్వాడ జగన్నాధం' తర్వాత పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్' సినిమా తర్వాత మాత్రం ఎందుకో ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. పూజా హెగ్డే తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది కానీ నిజానికి పూజ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ సినిమా తర్వాత పూజకు కొత్త ఆఫర్లేవీ రాలేదు. ఇప్పటికే చేతిలో ఉన్న రెండు క్రేజీ సినిమాలు 'అల వైకుంఠపురములో'.. 'జాన్' తప్ప పూజకు కొత్తగా ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ అయితే లేదు.

ఈ సినిమాతో మరో హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. పేరు మృణాలిని రవి.. అందరూ ఇలానే పిలుస్తున్నారు. కొందరు మాత్రం మిర్నాలిని రవి(Mirnalini Ravi) అంటున్నారు. పాప సోషల్ మీడియా ఖాతాలో కూడా స్పెల్లింగ్ ఇలానే ఉంది. మరి న్యూమరాలజీ టచ్ ఉందేమో మనకు తెలియదు. ఈ పాప 'గద్దలకొండ గణేష్' లో హీరో అథర్వ మురళికి జోడీగా నటించింది. నటన విషయంలో మంచి మార్కులే వచ్చాయి కానీ ఎందుకో ఈ భామకు కొత్తగా ఆఫర్లు రాలేదు. అంటే హరీష్ శంకర్ మ్యాజిక్ ఈ భామ విషయంలో కూడా పని చేయలేదు అనుకోవాల్సిందే.