Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్‌ హీరో ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్‌

By:  Tupaki Desk   |   7 Jan 2023 7:00 AM GMT
పాన్ ఇండియా స్టార్‌ హీరో ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్‌
X
కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌.. రాక్ స్టార్‌ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యశ్‌ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసక్తికర అప్‌ డేట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో యశ్‌ నుండి బ్యాడ్‌ న్యూస్ వచ్చింది.

ఈనెల 8వ తారీకున యశ్‌ పుట్టిన రోజు ఉంది. ఆ రోజున ఈ కేజీఎఫ్ స్టార్‌ తదుపరి సినిమా ఒక భారీ పాన్ వరల్డ్ మూవీగా ప్రకటన రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఇప్పటికిప్పుడు కొత్త సినిమాను ప్రకటించడం లేదు అంటూ యశ్ అధికారికంగా ఒక నోట్‌ ను విడుదల చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు.

ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి.. ఎన్నో కథలు యశ్ విన్నాడట. ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో ఆయన ఒక నిర్ణయానికి రాలేక పోయాడు. ఈ ఏడాదిలో కచ్చితంగా యశ్ సినిమా ఉంటుంది కానీ అది ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సినిమా అప్ డేట్‌ లేక పోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది. ఇలా అయితే ఎలా అంటూ చాలా మంది ఫ్యాన్స్ నిరుత్సాహం తో ఉన్నారు.

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలోనే యశ్ తదుపరి సినిమా కూడా ఉంటే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ అదే నిజం అయితే ప్రస్తుతం ప్రభాస్ తో సలార్‌ చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాను చేయాల్సి ఉంది. ఆ తర్వాత కానీ యశ్‌ తో సినిమాను మొదలు పెట్టే అవకాశం లేదు. అంటే కనీసం యశ్ తదుపరి సినిమా ప్రారంభానికి రెండు సంవత్సరాలు.. రావడానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.