Begin typing your search above and press return to search.

ఆ డేట్ ని అనాథలా వదిలేశారు

By:  Tupaki Desk   |   1 Aug 2019 5:30 PM GMT
ఆ డేట్ ని అనాథలా వదిలేశారు
X
వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయ్యింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి. ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు విడుదల చేయడం అనక అయ్యో పోటీ వల్ల మాకు పూర్తి వసూళ్లు రాలేదని వాపోవడం ఈ మధ్య పరిపాటిగా మారింది . లేదూ అంటే ఖాళీగా డేట్లను అలా వదిలేయడం . ఇది సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జరుగుతోందో లేదో పంతానికి పోయి మా సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకంతో తెగబడుతున్నారో అర్థం కావడం లేదు కానీ మొత్తానికి ఏదో ఒక రకంగా ప్రభావమైతే పడుతోంది.

రేపు గుణ 369-రాక్షసుడుల మధ్య పోటీ ఉండగా మరో చిన్న సినిమా శివరంజని కూడా రేస్ లో ఉంది. వచ్చే వారం 9న నాగార్జున మన్మథుడు 2తో వస్తుండగా ఒక్క రోజు గ్యాప్ తో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్టతో రావడం మరో విచిత్రం. ఇక సాహో వదిలేసిన ఆగస్ట్ 15ని శర్వానంద్ రణరంగం - అడవి శేష్ ఎవరు జాయింట్ గా బుక్ చేసుకున్నాయి

కానీ ఆగస్ట్ 23ని మాత్రం ప్రస్తుతానికి అనాథలా వదిలేశారు. ఆ రోజు ఏ సినిమా షెడ్యూల్ చేయలేదు. దానికి వారం గ్యాప్ లో సాహో వస్తోంది కాబట్టి భయపడుతున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏదైనా చిన్న సినిమా లేదా మీడియం బడ్జెట్ ది ఆ డేట్ లో వేసుకున్నా మంచి టాక్ వస్తే ఈజీగా వారం రోజులు వర్క్ అవుట్ చేసుకుంటుంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే సాహో వచ్చాక థియేటర్లు తగ్గుతాయి కానీ మరీ జీరో అయిపోయే ఛాన్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఎవరు ఆ డేట్ మీద కన్ను వేయకపోవడంతో ఆ వీక్ మొత్తం చాలా డ్రైగా సాగే ఛాన్స్ కనిపిస్తోంది.