Begin typing your search above and press return to search.

డిప్రెషన్ లో శ్రీను వైట్ల??

By:  Tupaki Desk   |   14 Oct 2019 11:59 PM IST
డిప్రెషన్ లో శ్రీను వైట్ల??
X
ఓ ఆరేళ్ళ క్రితం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల లిస్టులో శ్రీను వైట్ల ఉండేవారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉండేవారు. అయితే 2014 లో విడుదలైన 'ఆగడు' ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఎంత పెద్ద దర్శకుడికైనా ఫ్లాపులు సహజమే అన్నట్టుగా ఆ తర్వాత కూడా శ్రీను వైట్లకు మంచి ఆఫర్లే వచ్చాయి. అందులో 'బ్రూస్ లీ' ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది. అయినా ఫైనల్ గా వరుణ్ తేజ్ తో 'మిస్టర్' సెట్ అయింది. ఆ సినిమా ఫలితంలో కూడా మార్పు లేదు.

ఇక శ్రీను వైట్ల లాస్ట్ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని' గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సినిమాతో శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో శ్రీను వైట్ల-అఖిల్ కాంబినేషన్ సినిమా గురించి కొన్ని వార్తలు వచ్చాయి కానీ అవి గాసిప్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఇద్దరు హీరోలతో శ్రీను వైట్ల ఒక కామెడీ ఎంటర్టైనర్ కథ రెడీ చేస్తున్నారని ఏప్రిల్ లో మరో వార్త వినిపించింది కానీ శ్రీను వైట్ల రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసి ఇద్దరు హీరోలు డేట్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని అప్పుడే కామెంట్లు వినిపించాయి. శ్రీను వైట్లకు దాదాపు హీరోలందరూ మొహం చాటేస్తున్నారని సమాచారం. మీడియమ్ రేంజ్ హీరోలే కాదు.. కొత్త హీరోలు కూడా శ్రీను వైట్లతో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దీంతో శ్రీను వైట్ల ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఎలాంటి దర్శకుడి కెరీర్లో అయినా ఈ రకమైన దశ ఉంటుంది. ఎంత పెద్ద దర్శకులైనా దీనికి అతీతం కాదు. అయితే ఈ పరిస్థితి నుంచి కోలుకుని మరో సినిమా చేసి బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అన్నదే ప్రశ్న. నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ కాకమునుపు పూరి జగన్నాధ్ పరిస్థితి కూడా అలాంటిదే. అయితే ఇస్మార్ట్ సినిమా విజయంతో పూరి మళ్ళీ ట్రాక్ లో కి వచ్చారు. మరి శ్రీను వైట్ల సంగతి ఏమౌతుందో వేచి చూడాలి