Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఊహించ‌ని క‌ల‌వ‌రానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   4 Nov 2020 10:30 AM IST
ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఊహించ‌ని క‌ల‌వ‌రానికి కార‌ణం?
X

ఏదైనా ఒక స్క్రిప్టును ఎంపిక చేయాలంటే ఎంతో ఆచితూచి ఆలోచించ‌డం సాయి ప‌ల్ల‌వికి అల‌వాటు. త‌న పాత్ర ప‌రిధి స‌హా క‌థ న‌చ్చ‌క‌పోతే ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా రిజెక్ట్ చేసిన సంద‌ర్భాలున్నాయి. ఆ క్ర‌మంలోనే సాయిప‌ల్ల‌విపై కొంత నెగెటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇక సాయి ప‌ల్ల‌వి ట్యాలెంట్ గురించి తెలిసిన ఏ ద‌ర్శ‌కుడూ త‌న‌ని వ‌దులుకునేందుకు ఈగోల‌కు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ‌రు.

రౌడీ రాణిగా మాస్ యాక్టింగ్ చేయాల‌న్నా.. నైజాం పోరిగా లోక‌ల్ యాస‌తో క‌ట్టి ప‌డేయాల‌న్నా సాయి ప‌ల్ల‌వి ఆహార్యం ప‌క్కాగా సూట‌బుల్. అలాగే మైఖేల్ జాక్స‌న్ .. రిహానాలా డ్యాన్సింగ్ ట్యాలెంట్ కూడా సాయి ప‌ల్ల‌వికి ఉన్న అద‌న‌పు క్వాలిటీ. అందుకే త‌న‌తో ఒక్క సినిమా అయినా చేయాల‌ని క‌ల‌లుగనే ద‌ర్శ‌కులున్నారు. అందం కంటే ప్ర‌తిభ‌తో మిరాకిల్స్ చేస్తున్న నాయిక‌గా సాయి ప‌ల్ల‌వి పేరు ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తుంది.

అయితే స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఆఫ‌ర్ చేసిన ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టును సాయిప‌ల్ల‌వి సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని తెలుస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. ఫిదా బేబి ఇలా తిర‌స్క‌రిస్తుంద‌ని ఊహించ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అనీల్ రావిపూడి- దిల్ రాజు షాక్ కి గుర‌య్యార‌ట‌.

ఈ చిత్రాన్ని తిరస్కరించడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫిదా .. ఎంసీఏ లాంటి చిత్రాల్ని దిల్ రాజు బ్యాన‌ర్ లోనే చేసినా సాయి ప‌ల్లవి ఇలాంటి షాకింగ్ డెసిష‌న్ తీసుకుని క‌ల‌వ‌ర‌పెట్టేయ‌డం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం లవ్ స్టోరీ అనే మూవీ చేస్తోంది. మ‌రోవైపు ఎఫ్ 3ని ప్రారంభించే ముందే చిన్న గ్యాప్ ని స‌ద్వినియోగం చేసుకుంటూ... సాయి ప‌ల్ల‌వితో నాయికా ప్రధాన చిత్రం చేయాల‌నుకున్న రావిపూడి ప్ర‌స్తుతం డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. రౌడీ రాణి కాద‌ని అంది కాబ‌ట్టి ఎవ‌రిని ఎంపిక చేయాలి? అన్న‌ది ఆలోచిస్తున్నార‌ట‌.