Begin typing your search above and press return to search.

డ‌బ్బింగుల‌కు ఇక స్కోప్ లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   8 Jun 2020 6:00 PM IST
డ‌బ్బింగుల‌కు ఇక స్కోప్ లేన‌ట్టేనా?
X
ప్ర‌తియేటా టాలీవుడ్ లో 180- 200 స్ట్రెయిట్ సినిమాలు తెర‌కెక్కి రిలీజ‌వుతుంటాయి. అద‌నంగా మ‌రో 70 వ‌ర‌కూ డ‌బ్బింగ్ సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. 2018-19 సీజ‌న్ లో డ‌బ్బింగ్ రిలీజ్ ల దూకుడు పెరిగింద‌నే చెప్పాలి. ఇక త‌మిళంలో రిలీజ‌వుతున్న చాలా సినిమాలు తెలుగులోకి అనువాద‌మై రిలీజ‌వుతుంటాయి. ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ - సూర్య‌- కార్తీ- విశాల్- విజయ్- అజిత్ .. ఇలా అగ్ర హీరోల సినిమాల‌కు ఇక్క‌డా అంతో ఇంతో మార్కెట్ ఉంది కాబ‌ట్టి ఒక హోప్ తో వ‌స్తుంటారు.

అయితే తెలుగులో డ‌బ్బింగ్ సినిమాల రిలీజ్ ల‌కు ఇప్పుడున్న స‌న్నివేశం లో ఏమేర‌కు ఆస్కారం ఉంది? అంటే ట్రేడ్ నిపుణులు పెద‌వి విరిచేస్తున్నారు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల థియేట‌ర్లు మూత‌ప‌డి తెరుచుకునే వీల్లేదు. సాధార‌ణ స‌మ‌యంలోనే డ‌బ్బింగుల‌కు థియేట‌ర్లు ఇచ్చేది త‌క్కువే. ప్ర‌స్తుతం స్ట్రెయిట్ సినిమాల‌కే క‌ష్ట‌కాలం త‌ప్ప‌లేదు. అలాంట‌ప్పుడు డ‌బ్బింగుల‌కు ఛాన్సెక్క‌డ ఉంటుంది.

ఆగ‌స్టులో థియేట‌ర్లు తెరిచినా తొలిగా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒక‌టొక‌టిగా వెయిటింగులో ఉన్న‌వి రిలీజ‌వుతాయి. భారీ సినిమాలు వ‌స్తున్నాయంటే.. వాటికి సైడివ్వాల్సిందే. క‌రోనాతో ప‌ని లేకుండా సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే డ‌బ్బింగ్ సినిమాల కోసం థియేట‌ర్లు ఉండ‌వు. పెద్ద స్థాయి లాబీయింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో 70-80 డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. కొంతమంది తమిళ స్టార్ హీరోలు ఇటీవలి సంవత్సరాలలో తమ చిత్రాలను ఏకకాలంలో విడుదల చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయినా ఈ క‌ష్ట కాలంలో ఆ ఆశ నెర‌వేర‌డం మాత్రం క‌ష్ట‌మే. ఈ సంవత్సరం తెలుగులో చివరి డ‌బ్బింగ్ చిత్రం `కనులు కనులు దోచాయంటే`. దుల్కార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మలయాళ చిత్రం ఫ‌ర్వాలేద‌నిపించింది. అయితే ఆ త‌ర్వాత 2020లో డ‌బ్బింగులు రిలీజ్ కి రాన‌ట్టేన‌ని భావిస్తున్నారు. మ‌రి మునుముందు సెకండాఫ్ 6 నెల‌ల ప‌రిస్థితి ఎలా ఉండ‌నుందో చూడాలి. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో!