Begin typing your search above and press return to search.

మాసు మోసపోతున్నారు బాసూ.

By:  Tupaki Desk   |   5 Dec 2015 5:30 PM GMT
మాసు మోసపోతున్నారు బాసూ.
X
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తరువాత నెల టిక్కెట్టు ప్రేక్షకుడిని మెప్పించిన సినిమా ఒక్కటంటే ఒక్కటీ లేదు.. భలే భలే నాని నవ్వుల తరువాత ఫ్యామిలీస్ ని రెండోసారి థియేటర్ కి రప్పించే స్టామినా గల సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదంటే నమ్ముతారా. షేర్ - త్రిపుర - అఖిల్ - బ్రూస్ లీ ఇలా వరుసపెట్టి సినిమాలు దండయాత్ర చేస్తూనే పోతున్నాయి తప్ప అన్ని సెంటర్ల ప్రేక్షకులు ఆదరించే బొమ్మ ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పడలేదు.

మధ్యలో కుమారి 21F మెప్పించినా అది కేవలం యూత్ ని టార్గెట్ చేసిన సినిమా. తక్కిన వర్గం ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఈ క్రమంలో కోనా కలంనుండి కదిలిన శంకరాభరణం మాస్ ప్రేక్షకుల లోటుని తీరుస్తుంది అనుకున్నారుగానీ నిఖిల్ అండ్ గ్యాంగ్ పూర్తిగా నిరాశపరిచారు.

దీంతో ఇప్పుడు కళ్ళన్నీ బెంగాల్ టైగర్ పైనే పడ్డాయి. సంపత్ నంది రచ్చని బాగానే హ్యాండిల్ చేసిన అనుభవం వుందికాబట్టి బెంగాల్ టైగర్ లో మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగానే వుంటాయని ఆశ. కాసింత ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చినా నెత్తిన పెట్టుకోవడంలో నెల టిక్కెట్ ప్రేక్షకులు రెడీగా వున్నారు. మరి సినిమాలు తీసేవారు రెడీయేనా??