Begin typing your search above and press return to search.

మసాలాలు లేకుండా మహేష్ బాబు సినిమా?

By:  Tupaki Desk   |   7 April 2019 2:08 PM IST
మసాలాలు లేకుండా మహేష్ బాబు సినిమా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. మహేష్ ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తన తదుపరి చిత్రాన్ని చేస్తాడని టాక్ ఉంది.

కొద్దిరోజుల క్రితం సుకుమార్ ఎపిసోడ్ జరిగిన సమయంలో అల్లు అరవింద్ నమ్రతను కలిసి ఒక విషయంపై చర్చలు జరిపారు. ఈ చర్చలపై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ గీతా ఆర్ట్స్ వర్గాలు వాటిని స్పెక్యులేషన్స్ అని తేల్చేశారు. గీతా ఆర్ట్స్ లో మహేష్ బాబు తో ఒక సినిమాను నిర్మించే విషయంపై అల్లు అరవింద్- నమ్రతల మీటింగ్ జరిగిందని అన్నారు. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ రీసెంట్ గా కథ చెప్పడం.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింద. ఈ కథ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఇదొక ప్యూర్ లవ్ స్టొరీ అని.. మహేష్ సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ను పక్కన పెట్టి పరశురామ్ ఈ కథను తయారు చేశారని సమాచారం. ఇలా సహజంగా ఉండే స్టొరీకే అల్లు అరవింద్ ప్రాధాన్యత ఇచ్చారట.. మహేష్ కూడా అలాంటి కథకే తన ఓటు వేయడం జరిగిందట న్యూ జెనరేషన్ ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. కమర్షియల్ మసాలాలు లేకుండా మహేష్ తో సినిమా అంటే ఒక సాహసమే. మరి సూపర్ స్టార్ కోసం ఎలాంటి ప్రేమ కథ రెడీ అవుతోందో!