Begin typing your search above and press return to search.

మంచిది.. బాహుబలి దగ్గరకు రాలే

By:  Tupaki Desk   |   30 July 2016 11:43 AM GMT
మంచిది.. బాహుబలి దగ్గరకు రాలే
X
బాహుబలి: ది బిగినింగ్.. రిలీజైన 10 రోజుల్లోనే దాదాపు 500 కోట్లు గ్రాస్ టచ్ అయిపోయిన కలక్షన్. ఆ తరువాత టోటల్ రన్ అయిన తరువాత సినిమా షుమారు 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. పీకె వంటి సినిమాలను తప్పిస్తే.. అన్ని ఇతర సినిమాల రికార్డులను దాటేసింది బాహుబలి. అయితే ఆ సినిమాను బీట్ చేసే సత్తా ఉన్నట్లు అందరూ అనుకుంది కబాలి గురించే. పెద్దాయన కుమ్మేస్తాడని ఆశించారు. కాని సీన్ రివర్స్ అయ్యింది.

మొదటి రోజు విపరీతమైన కలక్షన్లతో ఏకంగా ఇండియాలోనే టాప్ నెట్ కలక్షన్‌ వసూలు చేసిన సినిమాగా ''కబాలి'' రికార్డులను బీట్ చేయడం వాస్తవమే. కాని అదొక్కటే సరిపోదుగా బాహుబలిని బీట్ చేయాలంటే. అలా కస్సిస్టెంట్ గా సినిమా ఒక రెండు వారాలైనా ఆడేంత కంటెంట్ సినిమాలో ఉండాలి. అప్పుడే జనాలు.. 'మంచిది' (రజనీకాంత్ స్టయిల్లో) అంటూ సినిమాకు బోలెడెంత వసూళ్ళు చేకూరుస్తారు. కబాలి విషయంలో అక్కడే దెబ్బ పడిపోయింది. దాదాపు ఒక వారం గడిచాక వసూళ్ళను చూస్తే.. ఇండియాలో 172 కోట్లు గ్రాస్.. ఓవర్ సీస్ లో 90 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. మొత్తంగా 262 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఈ లెక్కన చూస్తే.. బాహుబలి దగ్గరకు ఏం వస్తుంది?

సర్లేండి.. బాహుబలి రికార్డులు కొట్టినా కొట్టకపోయినా.. కనీసం సినిమా మీద ఇన్వెస్టు చేసిన పంపిణీదారులకు లాస్ రాకుండా ఉంటే చాలు. మరి రజనీకాంత్ ఆ విషయంలోనైనా సక్సెస్ అయ్యాడా? ఇంకో నాలుగు రోజులు ఆగండి తెలుస్తుంది.