Begin typing your search above and press return to search.

వారి ఇన్వాల్వ్‌ మెంట్‌ వద్దనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   28 Oct 2018 8:34 AM GMT
వారి ఇన్వాల్వ్‌ మెంట్‌ వద్దనుకుంటున్నారు
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తాజాగా ‘అరవింద సమేత’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుని మరోసారి తన సత్తా చాటాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను త్రివిక్రమ్‌ ఈ చిత్రంతో ఇచ్చాడు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం అల్లు అర్జున్‌ తో చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ మూవీకి సిద్దం అవుతున్నాడు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌ లో జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. త్వరలో తెరకెక్కబోతున్న వీరి కాంబో మూవీ హ్యాట్రిక్‌ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా బన్నీతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ ఒక హిందీ సినిమాను రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడట. హిందీలో చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయాన్ని అందుకున్న సోను కె టిటు కి స్వీటి చిత్రం స్టోరీ లైన్‌ ను తీసుకుని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట. అయితే ఈ రీమేక్‌ తో టీ సిరీస్‌ సంస్థ టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యిందట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ తో కలిసి టీ సిరీస్‌ ఈ రీమేక్‌ ను నిర్మించాలని భావిస్తుందట. కాని త్రివిక్రమ్‌ మరియు రాధాకృష్ణలతో పాటు మెగా కాంపౌండ్‌ టిసిరీస్‌ కు నిర్మాణ భాగస్వామ్యం కల్పించేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.

రీమేక్‌ రైట్స్‌ కొనుగోలు చేసి గత చిత్రాల మాదిరిగా రాధాకృష్ణ బ్యానర్‌ హారిక అండ్‌ హాసిని లో తెరకెక్కించాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట. కాని టి సిరీస్‌ వారు మాత్రం రీమేక్‌ రైట్స్‌ అమ్మకుండా సొంతంగా నిర్మించాల్సిందే అని, లేదంటే తాము నిర్మాణ భాగస్వామ్యం ఉండాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట. కథకు సంబంధించిన చిన్న స్టోరీ లైన్‌ తీసుకున్నందుకు వారికి నిర్మాణ భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, టి సిరీస్‌ వారు రీమేక్‌ రైట్స్‌ ను అమ్మేందుకు ఒప్పుకోకుంటే కొత్త కథను బన్నీ కోసం రెడీ చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

బాలీవుడ్‌ కు చెందిన ఆ రీమేక్‌ ఓకే అయితే సినిమా డిసెంబర్‌ లో పట్టాలెక్కే అవకాశం ఉంది, ఒకవేళ రీమేక్‌ రైట్స్‌ అమ్మేందుకు టి సిరీస్‌ వారు నిరాకరిస్తే మాత్రం త్రివిక్రమ్‌ కొత్త కథ తయారు చేసేందుకు టైం పట్టే అవకాశం ఉందని, అదే జరిగితే వచ్చే ఏడాదిలో బన్నీ, త్రివిక్రమ్‌ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.