Begin typing your search above and press return to search.
అవార్డ్ వచ్చింది.. అనుభవించని కశ్మీర్ బాలుడు
By: Tupaki Desk | 14 Aug 2019 3:21 PM ISTజాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాలకు ఏడు విభాగాల్లో అవార్డులు దక్కాయి. మహానటికి అవార్డుల పంట పడింది. దీన్ని టాలీవుడ్ సినీ పరిశ్రమ, అవార్డు విన్నింగ్ సినిమా యూనిట్లు పండుగలా జరుపుకుంటున్నాయి. కానీ జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డు పొందినా కనీసం ఆ అవార్డు వచ్చిందన విషయం కూడా ఆ బాలనటుడికి తెలియని దౌర్భగ్య స్థితి నెలకొంది.
ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను విభజించిన బీజేపీ ప్రభుత్వం అక్కడ కర్ఫూ విధించింది. బక్రీద్ సందర్భంగా ఆ ఒక్కరోజు కర్ఫ్యూ సడలించింది. అయితే ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఫోన్- ఇంటర్నెట్ సేవలను కేంద్రం బంద్ చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన కశ్మీర్ బాలుడికి ఆ సమాచారం అందకపోవడం గమనార్హం.
జాతీయ ఉత్తమ బాల నటుడిగా ‘హమీద్’ అనే కశ్మీరీ చిత్రంలో నటించిన చిన్నారి బాలుడు తల్హ అర్షద్ రేషికి అత్యున్నత అవార్డు దక్కింది. హమీద్ చిత్రంలో అర్షద్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా మొత్తం కశ్మీర్ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై తీశారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ను కలిసిన చిన్నారి అర్షద్ మధ్య సాగిన భావోద్వేగాల కథే ఈ చిత్రం. కశ్మీర్ లో ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో అక్కడ శాంతి నెలకొనేలా ప్రజలకు బతుకుపై ఆశ కల్పించాలన్న ఉద్దేశంతో ఓ బాలుడు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మధ్య అల్లుకున్న కథే ఇదీ అని.. దీనికి జాతీయ అవార్డు రావడం తమ కష్టాన్ని గుర్గించినట్టైందని చిత్ర నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు.
అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అయిజాజ్ ఖాన్ జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డు తమ చిత్రానికి రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. కానీ కశ్మీర్ లో ఉన్న బాలనటుడు అర్షద్ కు ఈ విషయం చెబుతామంటే ఫోన్, ఇంటర్నెట్ లేకపోవడంతో వీలు కావడం లేదని.. అసలు ఈ విషయం కూడా బాలుడికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదో దారుణమైన పరిణామం అని వాపోయాడు.