Begin typing your search above and press return to search.

సినిమాను హైప్ చేసేందుకు వివాదాల బాట పట్టక తప్పదా?

By:  Tupaki Desk   |   5 Feb 2020 3:25 PM IST
సినిమాను హైప్ చేసేందుకు వివాదాల బాట పట్టక తప్పదా?
X
ఆయనో క్రేజీ యువ హీరో. సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ వచ్చింది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్ల తో డీలా పడ్డాడు. ఈ సమయంలో ఆయన నటించిన సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమాకు ఏమాత్రం హైప్ రావడం లేదు. షూటింగ్ డిలే కావడం.. గత సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉండడంతో సినిమా ఫలితం అటూ ఇటూ అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ సినిమా విజయం హీరోకు కీలకమే. ఎంత క్రేజ్ ఉన్న హీరో అయినప్పటికీ వరస ఫెయిల్యూర్లు మార్కెట్ ను దెబ్బ తీస్తాయనేది వాస్తవం. ఈ సినిమాకు బజ్ తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించడం లేదు. ఈ హీరో తనదైన శైలిలో ఏదైనా ఒక వివాదం తలకెత్తుకుంటే తప్ప ఈ సినిమాకు కాస్తయినా క్రేజ్ వచ్చేలా లేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ హీరో తన కెరీర్ మొదట్లో ఇలా వివాదాల పట్ల ఆసక్తి చూపినప్పటికీ ఇప్పుడు మాత్రం అలాంటివాటి జోలికి పోవడం లేదు. దీంతో సినిమాకు క్రేజ్ తీసుకురావడం కష్టంగా ఉంది. మరి సినిమాకు ముందు ఏమైనా గత శైలిలో ఒక కాంట్రవర్సీ కోసం చూస్తారా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఈ యువ హీరో నెక్స్ట్ సినిమా ఒకటి ప్రకటించారు కానీ పట్టాలెక్కలేదు. ఈ సినిమా తర్వాత పెద్ద బ్యానర్ లో ఒక కమిట్ మెంట్ ఉంది. మరి ఈ సినిమా ఫలితం ఎయా ఉంది అనే అంశం పైనే ఫ్యూచర్ ప్రాజెక్టులు.. వాటి బడ్జెట్లు.. హీరోగారి రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.