Begin typing your search above and press return to search.

ఫిబ్ర‌వ‌రి మాసం మ‌.. మ‌.. మాస్ కాదా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:09 PM IST
ఫిబ్ర‌వ‌రి మాసం మ‌.. మ‌.. మాస్ కాదా?
X
సంక్రాంతి పందెంలో నాలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. వాటి రిజ‌ల్ట్ తేలి పోయింది. ఈనెల‌ ముగింపులో మ‌రో రెండు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. జ‌న‌వ‌రి 31న అశ్వ‌థ్థామ‌.. చూసి చూడంగానే చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. నాగ‌శౌర్య న‌టించిన అశ్వ‌థ్థామ రియ‌లిస్టిక్ స్టోరీతో తెర‌కెక్కించామ‌ని శౌర్య తెలిపారు. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు యాక్ష‌న్ కి ఆస్కారం ఉంది. రాజ్ కందుకూరి వార‌సుడు శివ కందుకూరి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చూసీ చూడంగానే క్లాస్ అప్పీల్ తో క‌నిపిస్తోంది. ఈ సినిమా న్యూ జెన్ ల‌వ్ స్టోరి అని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు విజువ‌ల్స్ చెబుతున్నాయి.

ఇక జ‌న‌వ‌రి సంగ‌తి ఇలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి మాటేమిటి? అంటే.. ఈ నెల‌లో రిలీజ‌వుతున్న ఓ మూడు సినిమాల గురించి అంతో ఇంతో యూత్ లో ముచ్చ‌ట‌ సాగుతోంది. ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో (ఫిబ్ర‌వ‌రి 7)న జాను .. స‌వారి చిత్రాలు రిలీజ‌వుతుండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వ కానుక‌గా దేవ‌ర‌కొండ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` రిలీజ‌వుతోంది. అలాగే నితిన్ న‌టించిన భీష్మ ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ‌వుతోంది. ఈ నాలుగు సినిమాల్లో జాను- వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ - భీష్మ చిత్రాలపై జ‌నంలో కొంత ముచ్చ‌ట‌ సాగుతోంది. శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా ప్రేమ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న రీమేక్ సినిమా జాను పూర్తిగా క్లాస్ అప్పీల్ తో క‌నిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు క్లాస్ అప్పీల్ తో క‌నిపించాయి. అందువ‌ల్ల మాస్ కి చేరువ‌వుతుందా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్ పోస్ట‌ర్లు ఆస‌క్తి ని పెంచాయి. దేవ‌ర‌కొండ నాలుగు డిఫ‌రెంట్ షేడ్స్ లో క‌నిపించ‌నున్నాడు. అత‌డి పాత్ర ఓ ర‌చ‌యిత పాత్ర.. పైగా నాలుగు ప్రేమ‌క‌థ‌లు ఉన్నాయి కాబ‌ట్టి ఈ సినిమాకి క్లాస్ అప్పీల్ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు లాంటి క్లాస్ సినిమా తీసిన క్రాంతి మాధ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా క్లాస్ మెగా ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రికీ స‌రైన హిట్టు అన్న‌ది లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్. నితిన్ - ర‌ష్మిక జంట‌గా వెంకీ కుడుముల తెర‌కెక్కిస్తున్న `భీష్మ` యూత్ ఫుల్ ల‌వ్ స్టోరి తో తెర‌కెక్కుతోంది. క్లాస్ పోస్ట‌ర్ తో ఇప్ప‌టికే యూత్ లో ఆస‌క్తిని పెంచారు. త్వ‌ర‌లో సింగిల్స్ ప్ర‌మోష‌న్స్ కి భీష్మ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాలేవీ మాస్ కి రీచ్ అవుతాయా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ పరిశీలిస్తే.. ఫిబ్ర‌వ‌రి సినిమాలేవీ పెద్ద‌గా ఒప్ప‌లేవు అనే అర్థ‌మ‌వుతోంది. జాను కేవ‌లం ఒక సెక్ష‌న్ ఆడియెన్ వ‌ర‌కే. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ టైర్ 1 ఆడియెన్ కోసం మాత్ర‌మే. అలాగే భీష్మ ఇంచు మించు అలాంటి స‌న్నివేశంలోనే క‌నిపిస్తోంది. కేవ‌లం ఫిబ్ర‌వ‌రి మాత్ర‌మే కాదు.. మార్చిలోనూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది. మాస్ లో మాసివ్ హిట్ కొట్టే సినిమాలేవీ ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌లేదేమిటో!