Begin typing your search above and press return to search.

క‌రుణానిధి బ‌యోపిక్ జాడైనా లేదు!

By:  Tupaki Desk   |   3 Jun 2019 12:37 PM IST
క‌రుణానిధి బ‌యోపిక్ జాడైనా లేదు!
X
ఎన్టీఆర్ .. వైయ‌స్సార్ .. పీఎం న‌రేంద్ర‌మోదీ .. థాక్రే .. మ‌న్మోహ‌న్ .. ఇలా రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ లు వ‌చ్చి వెళ్లాయి. వీటిలో కొన్ని హిట్లు.. కొన్ని ఫ్లాపులు అయ్యాయి. ఒకేసారి అమ్మ‌ జ‌య‌ల‌లిత‌పై మూడు బ‌యోపిక్ లు తీస్తున్నారు. అయితే లెజెండ్ క‌రుణానిధి బ‌యోపిక్ గురించిన ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం తాజాగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆరుసార్లు త‌మిళ‌నాడును పాలించిన త‌లైవి జ‌య‌ల‌లిత‌పై సినిమా తీస్తున్నారు. నిత్యామీనన్ .. కంగ‌న లాంటి స్టార్లు న‌టిస్తున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ బ‌హుముఖ ప్ర‌జ్ఞావంతుడు `త‌లైవా` క‌రుణానిధి బ‌యోపిక్ గురించిన స‌మాచారం లేక‌పోవ‌డం అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అయితే క‌రుణానిధిపై బ‌యోపిక్ తీసే ప్ర‌య‌త్న‌మే సాగ‌లేదా? అంటే ఎందుకు లేదు. 12 సార్లు ఎమ్మెల్యే అయ్యి.. ఐదు సార్లు త‌మిళ‌నాడును ముఖ్య‌మంత్రిగా పాలించిన ఏకైక ర‌ధ‌సార‌థి క‌రుణానిధి. త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో పేరుమోసిన ర‌చ‌యిత‌. ఆయ‌న బ‌యోపిక్ లేదా? అంటే.. 2018లోనే `క‌ళైంగ‌ర్` పేరుతో సినిమా తీస్తున్నామ‌ని తంబీలు ప్ర‌క‌టించారు. కోలీవుడ్ లో ఎంతో క్రేజీగా సినిమా మొద‌లైంది. న‌వంబ‌ర్ లో ఓపెనింగ్ షాట్ కూడా తెర‌కెక్కించారు. `పొన్ మేగ‌లై` ఫేం జి.శ‌క్తి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.గ‌ణేష‌న్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆ సినిమాకి సంబంధించిన స‌రైన అప్ డేట్ లేదు. ఇక‌పోతే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో.. ఇత‌ర బ‌యోపిక్ ల‌లో ఎంజీఆర్ .. క‌రుణానిధి వంటి వారి పాత్ర‌ల‌కు సంబంధించిన గెట‌ప్ లు రివీల‌య్యాయి. అస‌లింత‌కీ కురుణానిధి బ‌యోపిక్ తీస్తున్నారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

నేడు పెద్దాయ‌న 89వ‌ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ప్ర‌త్యేకంగా సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. క‌రుణానిధి వీరాభిమాని ప్ర‌కాష్ రాజ్ ఇదివ‌ర‌కూ ఓ సంద‌ర్భంలో `ఇద్ద‌రు` చిత్రంలో పెద్దాయ‌న‌ పాత్ర‌లో న‌టించ‌డంపై ఆస‌క్తిక‌ర సంగతుల్ని రివీల్ చేశారు. క‌రుణానిధి (ప్ర‌కాష్ రాజ్)- ఎంజీఆర్ (మోహ‌న్ లాల్)- జ‌య‌ల‌లిత (పుష్ప‌వ‌ల్లి పాత్ర పేరు - ఐశ్వ‌ర్యారాయ్) ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఇద్ద‌రు (ఇరువార్) కోసం ఎంతో రీసెర్చ్ చేశాన‌ని.. అయితే అస‌లు క‌రుణానిధి ని అనుక‌రించొద్ద‌ని మ‌ణిర‌త్నం కోరార‌ని ప్ర‌కాష్ రాజ్ వెల్ల‌డించారు. నేడు క‌రుణానిధి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప‌లువురు కోలీవుడ్ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ లో ``త‌మిళ ప్ర‌జ‌ల నిజ‌మైన నాయ‌కుడు క‌రుణానిధి జ్ఞాప‌కాలు చెరిగిపోనివి`` అని వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం.