Begin typing your search above and press return to search.

మ‌హేష్‌ కి ఈసారి నో హాలిడేసా?

By:  Tupaki Desk   |   20 March 2017 10:36 AM IST
మ‌హేష్‌ కి ఈసారి నో హాలిడేసా?
X
సినిమాకీ సినిమాకీ మ‌ధ్య త‌ప్ప‌కుండా విరామం తీసుకొంటాడు మ‌హేష్‌. ఒక పాత్ర‌లో నుంచి మ‌రో కొత్త పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేలా మైండ్ సెట్ మారాలంటే త‌ప్ప‌కుండా మ‌ధ్య‌లో ఓ వారం రోజులైనా గ్యాప్ కావాలంటుంటారు. ఆ టైమ్‌లో ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా విదేశాల‌కి వెళ్లొస్తుంటారు. ప్ర‌తి సినిమాకీ ఆయ‌న‌ది అదే వ‌ర‌స‌. అయితే ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఉండ‌క‌పోవ‌చ్చు. మురుగ‌దాస్ సినిమా పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల శివ త‌న సినిమా సెట్‌ కి రావ‌ల్సిందే అని మ‌హేష్‌ ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది కాబ‌ట్టి మే 1వ తేదీ నుంచే మ‌హేష్‌ పై స‌న్నివేశాలు తీసేలా కొర‌టాల ప్లాన్ చేశార‌ట‌.

మరోప‌క్క మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా షూటింగ్ ఏప్రిల్ ఆఖ‌రి వ‌ర‌కు జ‌రుగుతుంది. తెలుగుతోపాటు - త‌మిళంలోనూ తీస్తున్న సినిమా కావ‌డంతో మ‌హేష్ నాన్‌ స్టాప్‌ గా ప‌నిచేస్తున్నా ఆ సినిమా ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఎట్ట‌కేల‌కి ఏప్రిల్ పూర్తిలోపు సినిమా పూర్తిచేస్తాన‌ని మురుగ హామీ ఇచ్చాడ‌ట‌. అలా అయినా మ‌హేష్‌ కి ఈసారి నో హాలీడేస్ ని చెప్పొచ్చు. మురుగ సినిమా పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల సినిమా కోసం ఆయ‌న రంగంలోకి దిగాల్సిందే. ఇప్ప‌టికే కొర‌టాల అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. దేవిశ్రీప్ర‌సాద్‌ తో ఇటీవ‌లే మూడు ట్యూన్లు కూడా రెడీ చేయించాడు. ఇక మ‌హేష్ రంగంలోకి దిగ‌డ‌మే ఆల‌స్యం అన్న‌మాట‌. భ‌ర‌త్ అనే నేను అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఏప్రిల్‌ లోనే మొద‌ల‌వుతుంది. మొద‌ట ఇత‌ర న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తాడు కొర‌టాల‌. రెండో షెడ్యూల్ నుంచి మ‌హేష్‌ తో షూటింగ్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. అన్న‌ట్టు ఈ సినిమాలో కూడా శ్రుతిహాస‌నే క‌థానాయిక‌గా న‌టించొచ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌రిగితే ప‌క్కాగా శ్రీమంతుడు కాంబోలోనే సినిమా తెర‌కెక్కిన‌ట్టు అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/