Begin typing your search above and press return to search.

స‌క్సెస్ కొట్టినా ఊపేం క‌నిపించ‌లే బాస్!

By:  Tupaki Desk   |   16 Jun 2022 4:40 AM GMT
స‌క్సెస్ కొట్టినా ఊపేం క‌నిపించ‌లే బాస్!
X
స‌క్సెస్ రావ‌డం అంత వీజీ కాదు. వ‌చ్చిన త‌ర్వాత ఆ విజ‌యాన్ని నిల‌బెట్టుకోవ‌డంపైనా అంతే బాధ్య‌త వ‌హించాలి. లేదంటే ఆర్డ‌ర్ మారిపోతుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ ఫీల్డ్ లో అప్ డేట్ అవుతూ ముందుకు వెళ్ల‌క‌పోతే ప‌న‌వ్వ‌దు. ఇక్క‌డ హీరోయిన్లు ఎంత వేగంగా దూసుకుపోతారో..వెనుక‌బ‌డిన డైరెక్ట‌ర్లు సైతం అంతే వేగంగా ముందుకు క‌ద‌లాలి.

లేక‌పోతే వ‌చ్చిన స‌క్సెస్ ని సైతం మ‌ర్చిపోయే ప్ర‌మాదం ఉంది. ఎంత పెద్ద విజ‌యం అదించినా గ్యాప్ తీసుకుంటే మాత్రం కొంత వ‌ర‌కూ కెరీర్ పై ప్ర‌భావం ప‌డుతుంద‌న్ని వాస్త‌వం. మ‌రి ఇటీవ‌ల అలా స‌క్సెస్ అందుకుని రేసులో వెనుక‌బ‌డిన డైరెక్ట‌ర్ల గురించి ప్ర‌స్తావిస్తే..ఈ ఐదుగురు గురించి క‌చ్చితంగా చెప్పాలి. వాళ్లే వేణు శ్రీరామ్...భాస్క‌ర్...సాగ‌ర్ చంద్ర‌..క‌ళ్యాణ్ కృష్ణ‌.. కిషోర్ తిరుమ‌ల‌.

'మిడిల్ క్లాస్ అబ్బాయ్' త‌ర్వాత వేణు శ్రీరామ్ ఐదేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ 'వ‌కీల్ సాబ్' తో స‌క్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ 'పింక్' రీమేక్ గా తెర‌కెక్కిన 'వ‌కీల్ సాబ్' ప్రేక్ష‌కుల్ని బాగానే మెప్పించాడు. వెండి తెర‌పై స‌రికొత్త ప‌వ‌న్ ని ఆవిష్క‌రించిన ప్రత‌య్నం ప్ర‌శంసించ‌ద‌గ్గ‌దే. మేక‌ర్ గా వేణు శ్రీరామ్ తాను చేయాల్సిందే చేయ‌గ‌లిగాడు.

అయితే క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా రేసులో వెనుక‌బ‌డింది త‌ప్ప‌..కంటెంట్ స‌హా ప‌వ‌న్ ఇమేజ్ తో కొంత వ‌ర‌కూ మ్యాజిక్ చేయ‌గ‌లిగారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ వేణు శ్రీరామ్ కి మ‌రో అవ‌కాశ‌మే గ‌గ‌నమైపోయింది. స్టార్ హీరో రేంజ్ ప‌క్క‌న‌బెడితే క‌నీసం మీడియం రేంజ్ హీరోతో కూడా ఛాన్స్ అందుకోలేక‌పోతున్నారు. కొత్త ప్రాజెక్ట్ విష‌యంలో వేణు ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు.

ఇక 'బొమ్మ‌రిల్లు' భాస్క‌ర్ రాక‌ రాక వ‌చ్చినే అవకాశాన్ని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' తో స‌ద్వినియోగం చేసుకున్నారు. అఖిల్ కెరీర్ కి సిస‌లైన స‌క్సెస్ ని అందించారు. యంగ్ హీరో లో ల‌వ‌ర్ బోయ్ ని మ‌రోసారి త‌ట్టిలేపారు. ఈ సినిమాతో అకిల్ కి గాళ్స్ లో ఫాలోయింగ్ పెరిగింది. మార్కెట్ ప‌రంగాను మెరుగ్గా క‌నిపిస్తున్నారు. కానీ భాస్క‌ర్ కి మాత్రం మ‌రో సినిమా ఛాన్స్ రాలేదు. బ్యాచిల‌ర్ సినిమా రిలీజ్ అయి తొమ్మిది నెల‌లు గ‌డుస్తున్నా ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్ ఏదీ లేదు. దీంతో భాస్క‌ర్ ఇంకా హీరోని వెదికే ప‌నిలోనే ఉన్నారా? అన్న సందేహం రాక మాన‌దు.

ఇక 'భీమ్లా నాయ‌క్' స‌క్సెస్ తో సాగ‌ర్ చంద్ర పేరు మేక‌ర్ గా బాగానే వెలుగులోకి వ‌చ్చింది. బిహైండ్ త్రివిక్ర‌మ్ ఉన్నా ప‌వ‌న్ ప్రోత్స‌హించిన ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి సాగ‌ర్ పేరు బాగానే వెలిగింది. ఇంత వ‌ర‌కూ బాగానే మంది. మ‌రి మేక‌ర్ గా సాగ‌ర్ బిజీ అయ్యారా? అంటే ఆ స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప‌వ‌న్ సినిమా రిలీజ్ అయి నాలుగు నెల‌లు పూర్త‌యింది.

ప‌వ‌న్ వేర్వేరు ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా రు త‌ప్ప‌..ప‌వ‌న్ ని డైరెక్ట్ చేసిన మేక‌ర్ మాత్రం ఖాళీగానే క‌నిపిస్తున్నారు అన్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తుంది. ఇంత‌కు ముందు సాగ‌ర్ త‌న ఫ‌రిదిలో కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ ఇమేజ్ తో వాటి జోలికి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి ఈ స్థితి నుంచి సాగ‌ర్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో?

ఇక క‌ళ్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' స‌క్సెస్ తో మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. 'నేల టిక్కెట్' తో ట్రాక్ త‌ప్పిన క‌ళ్యాణ్ ని మ‌ళ్లీ క నాగార్జున ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడంతా ప‌రిస్థితి అత‌నికి అనుకూలంగానే ఉంది. కానీ నెల‌లు గ‌డుస్తున్నా? ఇంకా కొత్త ఛాన్స్ రాలేదు. వాట్ నెక్స్ట్ అన్న దానిపై క్లారిటీ మిస్ అవుతుంది.

అలాగే సేఫ్ జో న్ లో ఉన్న మ‌రో ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. 'రెడ్' మినిహా మిగ‌తా చిత్రాలు అన్ని ప‌ర్వాలేదు. ఇటీవ‌లే 'ఆడ‌వాళ్లు మీకు జోహార్లు' అంటూ మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. అంత‌కుముందు 'నేను శైల‌జ‌'...'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'..'చిత్రల‌హ‌రి' విజ‌యాల‌తో మంచి ట్రాక్ ఉంది. కానీ క‌మిట్ మెంట్ల ప‌రంగా వేగం పుంజుకోలేదు. ఇలా న‌యా ద‌ర్శ‌కులంతా స‌క్సెస్ ల్లో క‌నిపిస్తున్నా..ఆస‌క్సెస్ ని.. వేగాన్ని కొన‌సాగించ‌డంలో వెనుక‌బ‌డే ఉన్నార్న విమ‌ర్శ వినిపిస్తుంది.