Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లో గుండమ్మ మిస్?

By:  Tupaki Desk   |   21 Nov 2018 11:27 AM IST
ఎన్టీఆర్ లో గుండమ్మ మిస్?
X
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు కాని దర్శకుడు క్రిష్ కు మాత్రం ఆర్టిస్టుల సెలక్షన్ కత్తి మీద సాములా మారింది. తన శక్తివంచన లేకుండా అందరూ టాప్ క్వాలిటీ టీం ని సెట్ చేసుకున్నప్పటికీ కొన్ని పాత్రలకు మాత్రం ఆప్షన్ దొరక్క ఏకంగా స్క్రిప్ట్ నుంచే తీసేయాల్సి వచ్చిందట. అందులో సూర్యకాంతం గారి రోల్ ఉండటం అభిమానులకు కొంత బాధ కలిగించే విషయం. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్ కథానాయకుడులో సూర్యకాంతం గారి రోల్ ను పోషించే నటి దొరక్క క్రిష్ ఆవిడ లేకుండానే కథను నడిపించాల్సి వచ్చిందని తెలిసింది.

ఎన్టీఆర్ సూర్యకాంతం కాంబోలో చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ ఉన్నా తన పేరు మీద కథ మొత్తం నడిపించిన గుండమ్మ కథ అంటే తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోలేరు. అలంటి గుండమ్మగా ఎవరు కనిపిస్తారా అనే ఆశల మీద నీళ్ళు చల్లినట్టే. నిజానికి సూర్యకాంతం గారిని తెరమీద రిఫ్లెక్ట్ చేయగలిగే ఆర్టిస్టు కాని అంత సాహసం కాని ఇప్పుడున్న తరంలో ఎవరికి లేదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్-నాగ చైతన్యతో గుండమ్మ కథ రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు సూర్యకాంతం గారిని మరిపించే నటి ఎవరు లేకపోవడంతో మళ్ళి ఆ ప్రతిపాదన జోలికి వెళ్ళలేదు.

ఇప్పుడు కేవలం రెండు మూడు సన్నివేశాలకు క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు సైతం ఇబ్బంది పడ్డాడు అంటే ఆవిడ ప్రభావం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. సావిత్రి-శ్రీదేవి లాంటి లెజెండరీ క్యారెక్టర్స్ కు హీరొయిన్స్ సెట్ అయ్యారు కాని సూర్యకాంతం మాత్రం మిస్ అవుతారు. సో ఎన్టీఆర్ బయోపిక్ లో గుండమ్మను చూసే అవకాశం లేనట్టే