Begin typing your search above and press return to search.

రెయిడ్స్ గురించి బాహుబలి భయం లేదా?

By:  Tupaki Desk   |   18 Oct 2016 4:37 AM GMT
రెయిడ్స్ గురించి బాహుబలి భయం లేదా?
X
బాహుబలి 2 నైజాం ఏరియా రైట్స్ పలానా వారికి అమ్మేశాం అంటూ ట్విట్టర్ సాక్షిగా ప్రకటించింది సినిమా టీమ్. ఆ తరువాత సినిమాను ఏకంగా 50+ కోట్లకు ఆ ఏరియాలో అమ్మేశారు అంటూ కొన్ని ఫిగర్లు కూడా బయటకు వచ్చేశాయి. కట్ చేస్తే గత రాత్రి అన్ని టివి ఛానల్స్ లోనూ బాహుబలిః ది కంక్లూజన్ శాటిలైట్ రైట్లను ఏకంగా 51 కోట్లకు ఒక ప్రముఖ ఛానల్ కు అమ్మేశారు అంటూ న్యూస్. మన తెలుగు టివి ఛానళ్ళు కొనుక్కున్న ఛానల్ పేరు ప్రస్తావించలేదు కాని.. వెబ్ సైట్లలో మాత్రం సోనీ టివి అంటూ అప్పటికే వార్తలొచ్చేశాయి. అయితే ఈ పరిణామాలన్నీ సినిమాకు హైప్ తేవడానికేనా? అందుకే ఈ ఫిగర్లన్నీ బయటకు ప్రకటిస్తున్నారా? అనే సందేహం రాకమానదు.

నిజానికి ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా.. మా సినిమాకు ఇంతైంది అంతైంది అంటూ ఈ మధ్యకాలంలో బయటకు చెప్పట్లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా సీక్రెట్ గా సాగిపోతున్నా యవ్వారం తరహాలో ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏం లీక్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఎటునుండి ఎలా దాడిచేస్తుందో అని భయం. ఆగడు సినిమా ప్రీ రిలీజ్ డీల్స్ గురించి బయటకు పొక్కినప్పుడు.. రిలీజ్ కు ఒక్కరోజు ముందు సదరు ప్రొడ్యూసర్ పై ఐటి రెయిడ్స్ జరిగాయ్. అలాగే దిల్ రాజు ఒక పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా.. రిలీజ్ కు వన్ డే ముందు ఆయనకు ఐటి షాక్ కొట్టింది. మరి బాహుబలికి అలాంటి రెయిడ్స్ గురించి అస్సులు దిగులూ విచారం భయం లేనట్లు ఉంది. లేకపోతే ఇంత ఓపెన్ గా అన్ని డీల్స్ గురించీ చెప్పేయరుగా!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/