Begin typing your search above and press return to search.

నో డౌట్ `వాల్తేరు వాసు` ఊర మాస్ లెక్క‌

By:  Tupaki Desk   |   7 Nov 2021 9:30 AM GMT
నో డౌట్ `వాల్తేరు వాసు` ఊర మాస్ లెక్క‌
X
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాస్ ఫాలోయింగ్ తోనే ఆయ‌న‌ మెగాస్టార్ అయ్యారు. ప‌క్కా మాస్ చిత్రాల‌తోనే మెగాస్టార్ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అంత‌టి లెజెండ‌రీ న‌టుడు మ‌ళ్లీ ఓ మాస్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురావ‌డానికి రెడీ అవుతున్నారు అంటే హైప్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. మ‌రో ఘ‌రానా మొగుడు- రౌడీ అల్లుడు - గ్యాంగ్ లీడ‌ర్- ముఠా మేస్త్రి అంటూ ఊరిస్తుంటే అంచ‌నాలు పీక్స్ కి చేరాయి! శ‌నివారం మెగాస్టార్ 154వ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కె.ఎస్ ర‌వీంద్ర‌(బాబి) ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ కాంబినేష‌న్ లో సినిమా ప్ర‌క‌టించ‌గానే బాబి ప‌క్కా మాస్ చిత్రమ‌ని రివీల్ చేసారు. మెగాస్టార్ ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేస్తున్న‌ట్లు.. ప‌క్కా మాస్ క‌మ‌ర్శియ‌ల్ కంటెంట్ ఉన్న‌ చిత్ర‌మ‌ని బాబి అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేసారు.

తాజాగా సినిమా ప్రారంభం అవ్వ‌డంతో బాస్ మాస్ లుక్ ఎలా ఉండ‌బోతుంద‌న్న ఎగ్టైట్ మెంట్ అప్పుడే మొద‌లైపోయింది. ఇప్ప‌టికే మెగాస్టార్ ప్రీ లుక్ మాస్ ఆడియ‌న్స్ లో కి ఓ రేంజ్ లో వెళ్లిపోయింది. `వాల్తేరు వాసు` అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. `ముఠామేస్త్రి` రేంజ్ మాస్ కంటెంట్ చిత్ర‌మ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అంతా భావిస్తున్న‌ట్లే ప‌క్కా పుల్ మీల్స్ వ‌డ్డించే చిత్ర‌మిద‌ని అంటున్నారు. మెగాస్టార్ లో మాస్ అప్పీరియ‌న్స్ ని కొత్త కోణంలో ఆవిష్క‌రించ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో మొత్తం నాలుగు పాట‌లున్నాయ‌ట‌. దేవిశ్రీ ప్ర‌సాద్ మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా మంచి ట్యూన్స్ కంపోజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ అభిమానుల‌కు ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా..ఓ పెద్ద బ‌హుమ‌తిగా ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు ఎవ‌రు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మోహ‌న్ రాజా ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కి చేరుకుంది.