Begin typing your search above and press return to search.

ఇక డౌట్ లేదు .. విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:30 PM GMT
ఇక డౌట్ లేదు .. విజయ్ బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్!
X
కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాల వసూళ్ల విషయంలో పాత రికార్టులను తుడిచేసి కొత్త రికార్డులను నమోదు చేస్తుంటాడు. విజయ్ కంటూ ఒక స్టైల్ ఉంది .. ఆ స్టైల్ ని అక్కడ ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. ఆయన సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి విజయ్ కొంతకాలంగా భారీ విజయాలను తన ఖాతాలో జమచేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందింది.

సన్ పిక్చర్స్ వారు ఈ మధ్య భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు. అలా వాళ్ల బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహారించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ కథలను రెడీ చేసుకునే పద్ధతి .. తెరపై కథనాన్ని నడిపించే తీరు డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. అలా ఆయన రూపొందించిన 'బీస్ట్' .. టైటిల్ నుంచి .. విజయ్ లుక్ నుంచి అంచనాలు పెంచుతూ వెళుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం పోస్టర్లను బట్టే అర్థమైపోతోంది.

అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విజయ్ సరసన కథానాయికగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. తన కెరియర్ ఆరంభంలో తమిళంలో చేసిన పూజ హెగ్డే, ఆ తరువాత మళ్లీ అటువైపు చూడలేదు. పదేళ్ల తరువాత ఆమె అక్కడ చేసిన సినిమా ఇదే. ఈ సినిమాకి ఆమె భారీ పారితోషికం తీసుకుందనే టాక్ వచ్చింది. పారితోషికం విషయంలో నయనతార తరువాత స్థానంలో ఆమె నిలిచిందని అంటున్నారు.

బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో విజయ్ అభిమానులు ఉన్నారు. సెల్వ రాఘవన్ .. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి విజయ్ అంగీకరించాడు. ఇక ఇంతకుముందు తనకి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మురుగ దాస్ .. లోకేశ్ కనగరాజ్ లతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టులు మొదలుకానున్నాయి.