Begin typing your search above and press return to search.

గిల్ట్ బంగారానికి గిట్టుబాటు కాలేదట

By:  Tupaki Desk   |   18 Oct 2016 1:00 PM IST
గిల్ట్ బంగారానికి గిట్టుబాటు కాలేదట
X
రీసెంట్ గా బాహుబలి2 మూవీకి.. కేవలం హిందీ వెర్షన్ ఒక్కదానికే రూ. 51 కోట్లకు శాటిలైట్ పలకడం చూస్తుంటే.. ఈ మార్కెట్ ఏ రేంజ్ స్పీడ్ లో ఉందో తెలుస్తుంది. తెలుగులో ఛానళ్ల పోటీ ఎక్కువ కావడంతో.. మన దగ్గర ఈ పోటీ ముందు నుంచే ఉంది కూడా. శాటిలైట్ కోసం కూడా గతంలో కొందరు హీరోలుగా కంటిన్యూ అయ్యారంటే ఆశ్చర్యం వేయకమానదు.

కామెడీ హీరోలయిన అల్లరి నరేష్.. సునీల్ లు నటించే సినిమాలకు ఎప్పుడూ శాటిలైట్ కి డిమాండ్ బాగానే ఉండేది. కానీ రీసెంట్ గా వరుస ఫెయిల్యూర్స్ తో సునీల్ ఇబ్బంది పడుతుండగా.. రీసెంట్ మూవీ ఈడు గోల్డ్ ఎహె ఈ కష్టాలను మరింతగా పెంచేసింది. ఈ మూవీ రిలీజ్ కి ముందు 2 కోట్ల రూపాయల ఆఫర్ తో శాటిలైట్ హక్కులు అడిగింది ఓ ఛానల్. అప్పుడు బెట్టు చేయడం.. ఇంకా కావాలని అడగడంతో డీల్ కుదర్లేదు. ఇప్పుడు సినిమా ఫెయిల్యూర్ కావడంతో శాటిలైట్ సంగతి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ గోల్డ్ ఒరిజినల్ కాదని.. గిల్టు బంగారం అని జనాలు తేల్చేయడంతో.. సిట్యుయేషన్ ఛేంజ్ వచ్చేసింది.

నిర్మాతలు కోటికే శాటిలైట్ కట్టబెట్టేస్తామని అంటున్నా పట్టించుకునే వారు లేకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. సునీల్ గత మూవీ జక్కన్న బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు రాబట్టినా ఇంకా శాటిలైట్ మాత్రం అమ్ముడు కాలేదు. ఇప్పుడు ఈడు గోల్డ్ ఎహె కూడా శాటిలైట్ పెండింగ్ పడ్డంతో మరో మార్కెట్ సునీల్ చెయ్యి జారుతున్నట్లుగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/