Begin typing your search above and press return to search.

మళ్లీ ఎన్టీఆర్‌ బర్త్‌ డే వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?

By:  Tupaki Desk   |   24 July 2020 3:00 AM GMT
మళ్లీ ఎన్టీఆర్‌ బర్త్‌ డే వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?
X
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుండి రామరాజు పాత్ర ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. అందుకు సంబంధించిన మేకింగ్‌ వీడియో కూడా చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేశారు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ తో కొమురం భీమ్‌ ఫస్ట్‌ లుక్‌ వస్తుందని అంతా ఆశించారు. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్‌ తారు మారు అయ్యింది. ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు వీడియోను విడుదల చేయాలనుకున్న జక్కన్న కరోనా కారణంగా విడుదల చేయలేక పోతున్నట్లుగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కు సంజాయిషీ ఇచ్చాడు.

షూటింగ్‌ పున: ప్రారంభం అయిన తర్వాత ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ వీడియోను విడుదల చేసే అవకాశం ఉందని అంతా ఎదురు చూస్తున్నారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న లీక్స్‌ ప్రకారం వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ బర్త్‌ డే వరకు వీడియోను విడుదల చేసే అవకాశం లేదనిపిస్తుంది. సినిమాను వచ్చే ఏడాది జులై వరకు విడుదల చేయక పోవచ్చు అనే టాక్‌ ఇప్పటికే వచ్చింది. కనుక సినిమా ప్రమోషన్‌ కోసం వీడియోను అప్పుడే విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పుడు లేదంటే వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే పున: ప్రారంభించే అవకాశం ఉంది. షూటింగ్‌ మొదలు పెట్టిన తర్వాత ఆ హడావుడితో ఎన్టీఆర్‌ విడుదల చేయకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ వీడియోను చూడాలంటే ఇంకా చాలా నెలలు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని ముందే ఫ్యాన్స్‌ కు చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌ లు ఇస్తున్నారు. దీనికి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో మరి.