Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 మార్పు లేదా.. క్లారిటీ ఏది?

By:  Tupaki Desk   |   1 Feb 2022 8:01 AM GMT
కేజీఎఫ్‌ 2 మార్పు లేదా.. క్లారిటీ ఏది?
X
కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ మళ్లీ రీ షెడ్యూల్‌ అవుతున్నాయి. తెలుగు సినిమా నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని క్లాష్ లేకుండా సినిమా విడుదల తేదీలను కన్ఫర్మ్‌ చేసుకున్నారు. ఒకటి రెండు క్లాష్ లు తప్పడం లేదు కాని పెద్ద సినిమాలు మాత్రం క్లాష్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకటి రెండు రోజుల గ్యాప్‌ తో కూడా కొన్ని సినిమాలు విడుదల అయ్యేలా చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి మార్చి నుండి మొదలుకుని ఏప్రిల్‌ మరియు మే నెలల సినిమాలు కూడా కన్ఫర్మ్‌ అయ్యాయి.

అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కోసం వెయిట్‌ చేస్తున్న కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. చాలా నెలల క్రితమే కేజీఎఫ్ 2 ను ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ విడుదల తేదీ ప్రకటించిన సమయంలో చాలా సినిమాల విడుదల తేదీలు ప్రకటించారు. కాని కరోనా థర్డ్‌ వేవ్ కారణంగా దాదాపు అన్ని సినిమాల విడుదల తేదీలు రీ షెడ్యూల్‌ చేశారు. కాని కేజీఎఫ్ 2 విడుదల విషయంలో మాత్రం మార్పు లేదు.

యూనిట్‌ సభ్యులు ముందుగా అనుకున్న తేదీకి అంటే ఏప్రిల్‌ 14న కేజీఎఫ్ 2 ను విడుదల చేస్తారా లేదంటే మళ్లీ డేట్ ను మార్చే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కేజీఎఫ్ 2 సినిమా పై దేశ వ్యాప్తంగా జనాల్లో ఆసక్తి ఉంది. కేజీఎఫ్‌ 1 సినిమా ఘన విజయం సాధించడం తో రెండేళ్లుగా ప్రేక్షకులు కేజీఎఫ్ 2 కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

గత ఏడాదిన్నర కాలం గా మంచి సమయం కోసం వెయిట్‌ చేస్తున్న కేజీఎఫ్ 2 మేకర్స్ ఏప్రిల్‌ 14న విడుదల చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కేజీఎఫ్ 2 మేకర్స్ తో కూడా చర్చించిన తర్వాతే తెలుగు సినిమా నిర్మాతలు ఆ తేదీలో ఏ ఒక్క తెలుగు సినిమా రాకుండా జాగ్రత్త పడ్డట్లుగా టాక్‌ వినిపిస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదల విషయమై మరోసారి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కోరుకుంటున్నారు. చాలా నెలల క్రితం కన్ఫర్మ్‌ చేసిన ఆ తేదీని మళ్లీ కన్ఫర్మ్‌ చేస్తారా అనేది చూడాలి.

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 కు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందిన కేజీఎఫ్ 2 ను సేఫ్ జోన్ లో విడుదల చేయాలని మేకర్స్‌ చాలా కాలంగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.

కేవలం కన్నడంలో ఈ సినిమా రూపొందినా కూడా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా భారీ వసూళ్లు నమోదు కాబోతున్నట్లుగా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో కేజీఎఫ్ 1 సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అంతకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకునే సెంటిమెంట్‌ తో రెండవ పార్ట్‌ ను దర్శకుడు తెరకెక్కించాడట. కనుక ఈ సినిమా వసూళ్లు కూడా రికార్డు ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే వచ్చిన సమస్య ఏంటి అంటే విడుదల తేదీ. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చే వరకు అభిమానుల్లో గందరగోళం తప్పదు.