Begin typing your search above and press return to search.

యాక్షన్ హీరో స్పోర్ట్స్ డ్రామా పరిస్థితి ఏంటి..?

By:  Tupaki Desk   |   11 Dec 2020 12:30 AM GMT
యాక్షన్ హీరో స్పోర్ట్స్ డ్రామా పరిస్థితి ఏంటి..?
X
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ 'యజ్ఞం' 'ఆంధ్రుడు' 'గోలీమార్' 'లక్ష్యం' 'రణం' 'లౌక్యం' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ రేట్ లో బాగా వెనకబడిపోయాడు. గడిచిన మూడేళ్లలో వరుసగా ఐదు ప్లాపులను అందుకున్నాడు గోపీచంద్. 'సౌఖ్యం' తో మొదలైన పరాజయాలు 'పంతం' వరకు కొనసాగాయి. మధ్యలో ‘జిల్’ సినిమా యావరేజ్ గా నిలిచినా మిగిలిన సినిమాలు తీవ్రంగా నిరాశ కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ''సీటీమార్‌'' అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలపై క్లారిటీ లేదు.

గోపీచంద్ కెరీర్ లో 28వ సినిమా వస్తున్న 'సీటిమార్' లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్నారు. 'యూ టర్న్' చిత్రాన్ని అందించిన చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ మరియు తమన్నా లు కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఎలాగూ స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ఉంది కాబ‌ట్టి ఓపెనింగ్స్ కి డోఖా ఉండ‌దు. 'గౌతమ్ నంద' తర్వాత గోపిచంద్ - సంపత్‌ నంది కాంబోలో వస్తున్న ''సీటీమార్'' చిత్రం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.