Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బయోపిక్: ఏది నిజం ఏది అబద్ధం?
By: Tupaki Desk | 5 Nov 2018 11:58 AM ISTనందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' టైటిల్స్ తో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ బయోపిక్ గురించి రీసెంట్ గా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈమధ్య రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను మారుస్తున్నారని కథనాలు వచ్చాయి. ఒకవేళ అలా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పక్షంలో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజయ్యే అవకాశం లేదని అన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా టైట్ షెడ్యూల్స్ లో సాగుతోంది. మరి ఈ వార్తలు నిజమేనా? 'ఎన్టీఆర్' టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు ఈ వార్తలను ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు లాక్ చేసిన స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం.. పదం కూడా మార్చడం లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు అనుకున్న సమయానికే రావడం ఖాయమని అంటున్నారు.
ఈ లెక్కన 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' ముందు అనుకున్నట్టే జనవరి 24 న రిలీజ్ అవుతాయి. ఎలాగూ ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం కాబట్టి త్వరలో టీజర్ ట్రైలర్లు ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాన్నగారి లుక్స్ తోనే అందరినీ చంపేసిన బాలయ్య టీజర్ ట్రైలర్లతో డబిడిదిబిడి చేయడం ఖాయమే.