Begin typing your search above and press return to search.

చెయ్-స్యామ్.. కష్టం అంటున్నారు

By:  Tupaki Desk   |   18 March 2017 9:54 AM IST
చెయ్-స్యామ్.. కష్టం అంటున్నారు
X
అక్కినేని నాగ చైతన్య- టాప్ హీరోయిన్ సమంతల జంటకి బోలెడంత డిమాండ్. వీరి కాంబినేషన్ అంటేనే సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పటికే మూడు సార్లు కలిసి నటించిన వీరిద్దరు.. మరోసారి జట్టు కట్టబోతున్నారనే న్యూస్ వినిపించింది.

మరి కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోనున్న చెయ్-స్యామ్ లు.. మ్యారేజ్ తర్వాత ఓ మూవీలో కలిసి నటిస్తారనే అంచనాలున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా మొదలుపెట్టనున్న త్రివిక్రమ్.. ఆ తర్వాత చైతు-సమంతలతో మూవీ చేస్తాడని అన్నారు. అయితే.. ఇప్పుడీ కాంబినేషన్ లో సినిమా కష్టమే అని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. అసలు ఇప్పటివరకూ దీనిపై మాట మంతీ కూడా మొదలు కాలేదట. పైగా పవన్ తో సినిమా తర్వాత.. ఎన్టీఆర్- మహేష్ బాబులతో సినిమాలు చేయాల్సి ఉందట త్రివిక్రమ్.

అలాగే చేతిలో తెలుగు-తమిళ్ ప్రాజెక్టులతో సమంత కూడా ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య పరిస్థితి కూడా సేమ్ డిట్టో. ఈ ముగ్గురి కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశం లేదని.. సినీ జనాల భోగట్టా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/