Begin typing your search above and press return to search.

ఛస్‌.. ఛాన్సులు ఇవ్వరు గాని..

By:  Tupaki Desk   |   12 May 2016 11:00 PM IST
ఛస్‌.. ఛాన్సులు ఇవ్వరు గాని..
X
అతడో స్టార్‌ కమెడియన్‌.. అయితే ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఒక్కసారిగా చూస్తే.. అతనిలోని యూత్‌ ఫుల్‌ లుక్‌ కూడా మిస్సయ్యింది. దానితో ఇప్పుడు అతగాడికి రెగ్యులర్‌ గా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కూడా పిలవట్లేదు.

మ్యాటర్‌ ఏంటంటే.. మనోడి మీద ఈ మధ్యనే కొన్ని రాకూడని రూమర్లు వచ్చాయి. వాటితో హర్టయిన అతగాడు పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వడమే కాదు.. ఏకంగా రాష్ట్ర మంత్రులను కూడా కలుస్తున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో ఇతగాడికి బాసటగా నిలుస్తున్నారు కొంతమంది సీనియర్‌ ప్రొడ్యూసర్లు అండ్‌ సమ్‌ సెలబ్రిటీలు. అయితే ఇప్పుడు సపోర్టు ఇస్తున్న వీళ్ళందరూ తమ సినిమాలో మన కమెడియన్‌ ను ఎందుకు పెట్టుకోరో తెలియదు మరి. ఏమన్నా అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ అవుట్‌ డేటెడ్‌ సామెతలు వల్లిస్తుంటారు.

ఆకలేసినప్పుడు మంచి నీళ్ళు ఇవ్వడం తెలియదు కాని.. పది రోజులు పస్తున్న తరువాత రెడ్‌ బుల్‌ ఎనర్జీ డ్రింక్‌ ఇస్తాం అన్నట్లుంది వీరి యవ్వారం. ఇదే విషయం సదరు కమెడియన్‌ కు కూడా తెలుసు. కాకపోతే అవకాశాలు తగ్గిన వేళ ఆయన కూడా కామెంట్లు చేయడం ఎందుకులే అని మానేశాడట.