Begin typing your search above and press return to search.

ఆలస్యంగా మేల్కొంటున్న స్టార్ కిడ్

By:  Tupaki Desk   |   22 Sept 2019 1:47 PM IST
ఆలస్యంగా మేల్కొంటున్న స్టార్ కిడ్
X
చియాన్ విక్రం వారసుడిగా అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరంగేట్రం చేయబోతున్న ధృవ్ మీద మనవాళ్ళకు పెద్దగా అంచనాలు లేవు కాని తమిళనాడులో మాత్రం కుర్రాడి మీద అభిమానులకు భారీ ఆశలే ఉన్నాయి . ఆ మధ్య ఓ ఆడియో సింగల్ రిలీజ్ చేస్తే అది జనంలోకి బాగానే వెళ్ళింది. కబీర్ సింగ్ కు ముందే రిలీజ్ చేద్దామనుకున్నా నిర్మాణంతర కార్యక్రమాల్లో ఆలస్యం జరగడంతో కుదరలేదు. తీరా చూస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఎక్కడ పోలిక తెచ్చి ఇబ్బంది పెడతారో అని భావించిన యూనిట్ కొంత గ్యాప్ ఇచ్చింది. ఒకరకంగా ఇదే పొరపాటని చెప్పొచ్చు. ఫస్ట్ ఆడియో ట్రాక్ తో వచ్చిన రెస్పాన్స్ ని టెంపోని మైంటైన్ చేస్తూ ప్రమోషన్ ని కంటిన్యూ చేస్తే సరిపోయేది కాని ఇప్పుడు లేట్ గా రెండో పాటని రేపు ధృవ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఆల్బంలోనే బెస్ట్ సాంగ్ అవుతుందని పబ్లిసిటీ చేయడం బట్టి చూస్తే మ్యూజిక్ లవర్స్ ఎదురుచూపులు సార్ధకం అయ్యేలా ఉన్నాయి.

సందీప్ వంగా అసిస్టెంట్ గిరిసాయకు డెబ్యు మూవీగా తమిళ్ లో రూపొందిన ఈ మూవీతో ధృవ్ ని గట్టిగా సెటిల్ చేసే ఆలోచనలో ఉన్నాడు విక్రం. అందుకే బాలా తీసిన ఫస్ట్ వెర్షన్ ని పక్కనపెట్టేసి మరీ మొత్తం రీ షూట్ చేశారు. త్వరలో ట్రైలర్ ని లాంచ్ చేసి విడుదల తేదిని ప్రకటించే ఆలోచనలో ఉంది టీం. తెలుగులో హిందిలో బ్లాక్ బస్టర్ తక్కువ సక్సెస్ అందుకొని ఈ కల్ట్ లవ్ స్టొరీ తమిళ్ రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి