Begin typing your search above and press return to search.
దళపతి 'లియో' బజ్ తెలుగులో ఎందుకు డల్?
By: Tupaki Desk | 7 Jun 2023 9:00 PMదళపతి విజయ్ గురించి ఇప్పుడే తెలుగు ప్రేక్షకుల కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ట్యాలెంటెడ్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన తుపాకి తెలుగు అనువాదంతో ఇక్కడా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమా ని థియేటర్లకు వెళ్లి జనం ఎక్కువగా చూడకపోయినా ఓటీటీ లు టీవీ చానెళ్లలో చూశాక విజయ్ లోని ఎనర్జీకి స్పెల్ బౌండ్ అయ్యారు. అంతకుముందు విజయ్ కి చెందిన చాలా అనువాద సినిమాలు రిలీజైనా కానీ తుపాకి వేసిన ముద్ర వేరే లెవల్. ఆ తర్వాత మాస్టార్ సినిమా తోను తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ ని నెమ్మదిగా ప్రభావితం చేశాడు.
అయితే తెలుగు లో అంతకంత కు తన మార్కెట్ రేంజు ను పెంచుకోవాలన్న విజయ్ ఎత్తుగడ మాత్రం పూర్తిగా ఫలించడం లేదు. అతడి సినిమాల కు భారీ గా వెచ్చించి రైట్స్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా గా విజయ్ లియోకి అంతో ఇంతో బజ్ ఉందనేది వాస్తవం. అయితే లియో సినిమా కి తెలుగులో మాత్రం బజ్ ఏమంత లేదు. కానీ తమిళంతో పాటు ఓవర్సీస్ కేరళ లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ అద్భుతంగా సాగిందంటూ ప్రచారం సాగుతోంది. విజయ్ లియో ఓవర్సీస్ - కేరళ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో ఆల్ టైమ్ నంబర్ 1 తమిళ చిత్రంగా నిలిచిందని తమిళ మీడియా లో కథనాలొస్తున్నాయి.
లియో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమా పై తమిళనాట అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ - కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడయ్యాయ ని తెలిసింది. ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ రూపంలో రూ. 60 కోట్లు .. కేరళ రైట్స్ రూపంలో రూ. 16 కోట్లు రాబట్టిందని సమాచారం. కేరళ లో రజనీకాంత్‌ల 2.0 ప్రీ-రిలీజ్ బిజినెస్ ను 'లియో' అధిగమించి అత్యంత భారీ ధర కు అమ్ముడైన తమిళ చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్ రికార్డుల్ని తిరగేస్తే.. RRR -సాలార్ తర్వాత దక్షిణ భారత చిత్రాలలో 'లియో' మూడవ స్థానంలో ఉందని సమాచారం. ప్రీ-రిలీజ్ బిజినెస్ లో భారీ మొత్తాన్ని సంపాదించిన తమిళంలో మొదటిది.
'లియో' ఓవరాల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లో రూ. 350 కోట్లకు పైగా సాధించిందని కూడా కొన్ని తమిళ మీడియాల్లో ప్రచారమవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే మేకర్స్ కి లాభదాయకంగా ఉన్నా కానీ పంపిణీ వర్గాల ను థియేటర్ల నుంచి వచ్చే రెవెన్యూ ఆదుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకోబోతోందోనన్న ఉత్కంఠ అందరిలో ను ఉంది. ప్రస్తుతం లియో సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతోంది. విజయ్- అర్జున్ సర్జాలకు సంబంధించిన సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా కథాంశంతో లియో తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రం లో త్రిష- సంజయ్ దత్- అర్జున్ సర్జా- గౌతమ్ మీనన్ - ప్రియా ఆనంద్- మన్సూర్ అలీ ఖాన్- మాథ్యూ థామస్- శాండీ కూడా ఉన్నారు. మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22న విడుదల చేయనున్నారు. అయితే లియో కి ఇప్పటి వరకూ తెలుగు లో ప్రచార హైప్ లేనే లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నప్పుడు చేయాల్సిన హంగామా హడావుడి ఏమాత్రం లేకపోవడం కూడా ఒక రకంగా మైనస్ అని చెప్పాలి.