Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. బ్రహ్మానందాన్ని అడగలేదు

By:  Tupaki Desk   |   20 Nov 2015 9:00 PM IST
హమ్మయ్యా.. బ్రహ్మానందాన్ని అడగలేదు
X
ఒకరోజులో జరిగే ఒక నార్కొటిక్‌ ఆఫీసర్‌ లైఫ్‌ గా వచ్చిన చీకటి రాజ్యం అయినా.. లేకపోతే అనుమానంతో కాపురం చేసే ఒక బాయ్‌ ఫ్రెండ్‌ కథ అయిన కుమారి 21 ఎఫ్‌ గురించి కాని.. ఒక్క విషయం మాత్రం ఈసారి జనాలు అడగలేదు. ధియేటర్ల దగ్గర వినిపించిన టాక్‌ అంతా దాదాపు ఒకేలా ఉన్నా కూడా.. ఒక్క విషయంలో మాత్రం ఈరోజు విమర్శకులు ఊపిరి పీల్చుకున్నారు.

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏ సినిమా వచ్చినా కూడా.. జనాలు రెండు విధాలుగా స్పందిస్తున్నారు. అయితే బ్రహ్మానందం క్యారెక్టర్‌ లేదని చెప్పడం.. లేకపోతే బ్రహ్మీ ఉంటే బాగుండేది అని కామెంట్లూ చేయడం.. చేసేవారు. కాని ఈరోజు మాత్రం ఎవ్వరూ అలా అడగలేదు. ఒక పక్కన కమల్‌ థ్రిల్లర్‌ లో కనీసం లొట్టలేయకుండా కూర్చొని చూస్తే.. ఇటు కుమారి నైతే ఏకంగా షాకింగ్‌ గా చూశారు. ఎక్కడా కూడా కామెడీ కావాలని, కామెడీకి బ్రహ్మానందమే రావాలనే డిమాండ్‌ మాత్రం వినిపించలేదంతే. ఇది విన్న విమర్శకులందరూ హమ్మయ్యా అనుకున్నారు.

అయినా దీనికి జనాలను అని ఏం లాభం. ప్రతీ సినిమాలోనూ అదేదో బూస్టు తాగించినట్లు బ్రహ్మానందాన్ని ఆ రేంజులో అలవాటు చేశారు మన దర్శకులు. దాంతో సెకండాఫ్‌ లో బెమ్మం ఎప్పుడొస్తాడా అని అందరూ ఎదురుచూడడం షరా మామూలే అయిపోయింది.