Begin typing your search above and press return to search.

సాహో డైరెక్ట‌ర్ కి ఇత‌రుల నుంచి విషెస్ ఏవీ?

By:  Tupaki Desk   |   26 Oct 2021 11:28 AM GMT
సాహో డైరెక్ట‌ర్ కి ఇత‌రుల నుంచి విషెస్ ఏవీ?
X
`బాహుబ‌లి` త‌ర్వాత `సాహో` చిత్రం ప్ర‌క‌ట‌న‌తో యంగ్ ఫిలింమేక‌ర్ సుజీత్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిన సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్ అయిన వెంట‌నే ప్ర‌భాస్ వెంట‌నే సుజిత్ తో క‌లిసి `సాహో` చిత్రానికి ప‌నిచేసాడు. దీంతో యంగ్ మేక‌ర్ పేరు బాలీవుడ్ అంతటా ఫేమ‌స్ అయింది. ఈ స‌మ‌యంలో సుజీత్ తో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ స్టార్స్ ముందుకు వ‌స్తున్నారంటూ జాతీయ మీడియాలో ఓ రేంజులో ప్ర‌చారం సాగింది. కానీ `సాహో` వైఫ‌ల్యంతో ఒక్క‌సారిగా సుజీత్ క్రేజ్ ప‌డిపోయింది. అయినా యువ‌త‌రం ద‌ర్శ‌కుడు ప‌ట్టువ‌ద‌ల‌క ప్ర‌య‌త్నాల్ని ఆప‌లేదు. హైద‌రాబాద్ నుంచి ముంబైకి మ‌కాం మార్చి అక్క‌డి స్టార్లకు క‌థ‌లు వినపించాడు.

చివ‌రికి విక్కీ కౌశ‌ల్ ని ఎలాగైనా ఒప్పించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేసాడు. అయితే ఆ ప్ర‌య‌త్నాన్ని ఎందుక‌నో స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఆపేసారని గుస‌గుస‌లు వినిపించాయి.. దీంతో సుజీత్ ప‌రిస్థితి మ‌ళ్లీ బ్యాక్ టూ పెవిలీయ‌న్ గా మారిపోయింది. తిరిగి తిరిగి చివ‌రికి మ‌ళ్లీ యూవీ క్రియేష‌న్స్ లోనే మ‌రో సినిమా కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రూ కూడా అత‌నితో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించేంత సౌక‌ర్యంగా లేరు. ఈ నేప‌థ్యంలో సుజిత్ కోసం మ‌రోమారు యూవీ క్రియేష‌న్స్ చొర‌వ తీసుకోవాల‌ని చూస్తోందిట‌. చ‌క్క‌ని ప్ర‌తిభ ఉంది. ఏజ్ కూడా ఉంది. అత‌డు స్క్రిప్టుతో ఒప్పిస్తే స‌రిపోతుంది. హీరోని లాక్ చేసే బాధ్య‌త తామే తీసుకుంటామ‌ని సుజిత్ కి యూవీ నిర్మాత‌లు ప్రామిస్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం యూవీ సంస్థ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ప్ర‌భాస్ తో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఆసంస్థ ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉంది. ఈసినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. అప్ప‌టివ‌ర‌కూ సుజిత్ తో ఎలాంటి క‌మిట్ మెంట్ అధికారికంగా చేసుకునే అవ‌కాశం క‌నిపించ‌లేదు. నేడు సుజిత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా యూవీ సంస్థ శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే యూవీ మిన‌హా ఇంకెవ్వ‌రు సుజీత్ బ‌ర్త్ డే పై స్పందించ‌లేదు. ఇదే ఇండ‌స్ట్రీ లెక్క‌... హిట్లుంటేనే ఇక్క‌డ ప‌ట్టించుకునేదని మ‌రోసారి ప్రూవ్ అయింది.

యూవీ సంస్థ‌లోనే సుజిత్ తొలి చిత్రం `ర‌న్ రాజా ర‌న్` తెర‌కెక్కించి హిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సుజిత్ ని న‌మ్మి వంద‌ల కోట్లు వెచ్చించి అదే సంస్థ `సాహో`ని నిర్మించిన సంగ‌తి విధిత‌మే. సినిమా ఫలితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ సుజిత్ లో క్రియేటివిటీ టెక్నికాలిటీస్ లెవ‌ల్ కి మాత్రం మెచ్చుకోవాల్సిందే. మూసలో వెళ్తోన్న తెలుగు సినిమాను కాస్త అడ్వాన్స్ డ్ గా ముందుకు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేసాడు. కానీ కొన్ని త‌ప్పిదాల వ‌ల్ల ఫ‌లితం ఆశించిన‌ట్టుగా రాలేదు.