Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ బి-డే ట్రీట్ ఏమీ లేదా?

By:  Tupaki Desk   |   20 May 2019 4:21 AM GMT
యంగ్ టైగ‌ర్ బి-డే ట్రీట్ ఏమీ లేదా?
X
2001లో `నిన్ను చూడాలని` అనే సినిమాతో హీరో అయ్యారు తార‌క్. బాల‌న‌టుడిగా రాణించిన‌ప్పుడే అత‌డిని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. హీరోగా తెరంగేట్రం చేసి అటుపై యంగ్ టైగ‌ర్ గా ఎదిగిన వైనం చూస్తున్న‌దే. ఎస్.ఎస్.రాజ‌మౌళి.. వీవీ వినాయ‌క్ వంటి ద‌ర్శ‌కులు తార‌క్ కెరీర్ కి మైండ్ బ్లాక్ అయ్యే హిట్స్ ని అందించారు. వంశీ పైడిప‌ల్లి.. త్రివిక్ర‌మ్ క్లాస్సీ లుక్‌ ఉన్న సినిమాల‌తో అత‌డిని కొత్త కోణంలో చూపించారు. 2020తో కెరీర్ రెండు ద‌శాబ్ధాలు పూర్త‌వుతుంది. అప్ప‌టికి తిరిగి యాథృచ్ఛికంగా త‌న‌కు తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ (స్టూడెంట్ నం.1) ఇచ్చిన ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోనే న‌టిస్తున్నాడు. 2020 జూలై 30న తార‌క్ న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ‌వుతుంది. అప్ప‌టికి 20 ఏళ్ల కెరీర్ సెల‌బ్రేష‌న్స్ కి ఫ్యాన్స్ సిద్ధ‌మ‌వుతారు.

యంగ్ య‌మ ఎన్టీఆర్ బ‌ర్త్ డే నేడు.. ఈ సంద‌ర్భంగా ఎస్.ఎస్.రాజ‌మౌళి- డివివి దాన‌య్య టీమ్ అత‌డికి బ‌ర్త్ డే గిఫ్ట్ ఏం ఇస్తారు? అంటూ ఆస‌క్తిగా వేచి చూశారంతా. అయితే ఈసారి బ‌ర్త్ డేకి ఎలాంటి ట్రీట్ లేద‌ని అర్థ‌మ‌య్యేలా.. డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ తిరిగి కొమ‌రం భీమ్ కి సంబంధించి ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ నే తిరిగి సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేసి బ‌ర్త్ డే విషెస్ అందించింది. ఎస్.ఎస్.రాజ‌మౌళి సౌతం ఇన్ స్టాలో కొమ‌రం భీమ్ లుక్ కి సంబంధించి ఎలాంటి ఫోటోని షేర్ చేయ‌లేదు. ఆర్.ఆర్.ఆర్ నుంచి కొమ‌రం భీమ్ ప్రీలుక్ వ‌స్తుంద‌నుకుంటే.. ఓవ‌రాల్ గా అంద‌రూ తార‌క్ ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌రిచార‌నే చెప్పాలి.

ఇక‌పోతే నేడు త‌న బ‌ర్త్ డే వేడుక‌ల్ని జ‌రుపుకునే ఆలోచ‌న లేద‌ని ముందే అభిమానుల‌కు తార‌క్ సందేశం పంపార‌ని వార్త‌లొచ్చాయి. తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణానంత‌రం తారక్ కాస్తంత స్థ‌బ్ధుగానే ఉంటున్నారు. అందుకే ఎలాంటి హ‌డావుడి లేకుండానే ఈసారి బ‌ర్త్ డేని కానిచ్చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లోనే ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్.. డార్లింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నెక్ట్స్ బ‌ర్త్ డే(20 మే 2020)కి మాత్రం ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ అదిరిపోయేలా ఉంటుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. తార‌క్ కి డివివి దాన‌య్య‌.. కోన వెంక‌ట్ స‌హా ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌త్యేకించి తార‌క్ కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌ల్ని తెలియ‌జేస్తున్నారు.