Begin typing your search above and press return to search.

ఈసారి సంక్రాంతికి సినీ పండుగ లేనట్లేనా..?

By:  Tupaki Desk   |   4 Dec 2020 10:56 AM IST
ఈసారి సంక్రాంతికి సినీ పండుగ లేనట్లేనా..?
X
'సంక్రాంతి పండుగ' అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు 'సినిమా పండుగ'. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సఫీస్ వద్ద అనేక సినిమాలు సందడి చేస్తుంటాయి. పోయిన సంక్రాంతికి వచ్చిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో కరోనా కారణంగా వాయిదా పడిన క్రేజీ మూవీస్ అన్నీ సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాయి. మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్'.. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నితిన్ 'రంగ్ దే'.. దగ్గుబాటి రానా 'అరణ్య'.. రామ్ పోతినేని 'రెడ్' పండుగ సీజన్ లో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ 'వ‌కీల్ సాబ్'.. నాగచైతన్య 'లవ్ స్టొరీ'.. శర్వానంద్ 'శ్రీకారం' వంటి చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ లో ఉండే అవకాశం ఉందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి అంతా మారిపోయింది. రవితేజ 'క్రాక్' మినహా మిగిలిన సినిమాలు ఏవీ పండగ బరిలోకి నిలిచే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.

అయితే దీనికి ప్రధాన కారణం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేయడం ఒకటైతే.. అందులో కూడా కోవిడ్ నేపథ్యంలో సినిమాలను చూడటానికి జనాలు రావడం కష్టమనే ఆలోచన ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీలకు అలవాటు పడిపోయిన వారిలో ఎక్కువ శాతం క్లాస్ ఆడియెన్స్ థియేట‌ర్స్ కి వ‌చ్చేందుకు ఇష్టప‌డ‌టం లేదట. అందుకే మంచి రేటు వస్తే ఓటీటీ రిలీజ్ అయినా చేసుకోవచ్చు లేదా 100 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చాక విడుదల చేసుకోవచ్చనే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ సైతం ఇప్పుడు విడుదల చేయలేమని డిస్ట్రిబ్యూటర్లకు చెబుతున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ కేజ్రీ మూవీస్ అన్నీ విడుదల కావడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది.