Begin typing your search above and press return to search.

ఆ సీన్స్ మనకొద్దు అన్న అక్కినేనివారు!

By:  Tupaki Desk   |   3 April 2019 10:52 AM IST
ఆ సీన్స్ మనకొద్దు అన్న అక్కినేనివారు!
X
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒరిజినల్ 'మన్మథుడు' స్టైల్ లోనే ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాగురించి రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

'మన్మథుడు' లో లవ్.. ఫ్యామిలీ సెంటిమెంట్.. కామెడీ ఎలెమెంట్స్ తో పాటుగా యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. తన ఆఫీస్ లో పని చేసే ఒక అబ్బాయి పెళ్లిని జరిపించడానికి నాగార్జున ప్రయత్నించే సమయంలో ఒక ఫైట్ వస్తుంది. దీంతో 'మన్మథుడు 2' కోసం రెండు ఫైట్ సీన్స్ డిజైన్ చేసి పెట్టాడట దర్శకుడు రాహుల్. కానీ ఈ సినిమాకు యాక్షన్ బ్లాక్స్ అవసరం లేదని.. దీని బదులు ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేయమని సూచించాడట. దీంతో ఈ సినిమా నుండి యాక్షన్ సీక్వెన్సులను కట్ చేసినట్టు సమాచారం. 'మన్మథుడు 2' అనగానే ప్రేక్షకులు ఈ సినిమానుండి హిలేరియస్ కామెడీని ఆశిస్తారని.. ఎవరూ యాక్షన్ సీన్స్ ఆశించరనే ఆలోచనతోనే నాగార్జున ఇలా చెప్పాడట. నిజమే.. ఆడియన్స్ కు ఎంతసేపూ ఒరిజినల్ సినిమాలో కామెడీని మ్యాచ్ చేయగలరా అనే అనుమానాలు వస్తున్నాయి తప్ప ఎవరూ ఫైట్స్ గురించి మాట్లాడడం లేదు.

నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మి.. రావు రమేష్.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RX100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అక్కినేని నాగార్జున.. జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.