Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో థియేటర్ కావాలా నాయన

By:  Tupaki Desk   |   19 Aug 2017 7:11 AM GMT
హైదరాబాద్ లో థియేటర్ కావాలా నాయన
X
టాలీవుడ్ కలెక్షన్స్ మ్యాప్ లో నైజాం ఏరియాకి చాలా ప్రాధాన్యత ఉంది. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే విషయం నైజాం కలెక్షన్స్ పై ఆధాపడి ఉంటాయి. అయితే నైజాం ఏరియా కలెక్షన్స్ లో సింహ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో థియేటర్స్ నుంచే వస్తాయి. మిగతా చోట్ల నుంచి ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రావు. ఎక్కువుగా బి - సి సెంటర్లు ఉండే ఈ ఏరియాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు పంపిణీదారులదే ఆదిపత్యం.

దీంతో వారంతా కలిసి సినీ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. బయటకి ఎవరి వ్యాపారం వారిదే అంటూ ప్రచారం చేసిన - తెరవెనుక మాత్రం వారికి తగిన వారికే తప్ప మిగతా వారికి థియేటర్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం విడుదలైన మూడు సినిమాలు ఒక పంపిణీదారుడే విడుదల చేశాడంటేనే నైజాం ఏరియాలో ఫిల్మ్ ట్రేడ్ ఏ రీతిన సాగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో సింగిల్ థియేటర్లు కావాలంటే ఆ ఇద్దరు - ముగ్గరు డిస్ట్రీబ్యూటర్ల ఆఫీసులు చుట్టూ నిర్మాతలు ప్రదిక్షణలు చేయాల్సిందే. హైదరాబాద్ లో థియేటర్ కావాలంటే, మరో ఏరియాలో ఉన్న బిజినెస్ తో ముడిపెడుతున్నారని చాలా మంది నిర్మాతలు వాపోతున్నారు. ఏదైతేనేం ప్రస్తుంత నైజాం లో వాళ్ల టైమ్ నడుస్తుందని అనుకోవడం తప్ప వారిని ఏం చేయాలని పరిస్థితి నెలకొందని సినీ పెద్దలు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దీని పై దృష్టి పెడతారేమో చూడాలి.