Begin typing your search above and press return to search.

'టాలీవుడ్'లోకి మరో మలయాళం స్టార్..?

By:  Tupaki Desk   |   31 May 2021 8:30 AM GMT
టాలీవుడ్లోకి మరో మలయాళం స్టార్..?
X
ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో భాషా పరిమితులు అనేవి లేకుండా పోయాయి. ఎందుకంటే ప్రస్తుతం ఒక భాషలో నటించిన హీరోలు మరో భాషలో కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇదివరకు వేరే భాషల్లో క్రేజ్ సంపాదించుకోవాలంటే విలన్ - ఫ్రెండ్ లేదా ఇతర పాత్రలతో ఎంట్రీ ఇచ్చేవారు. ఇప్పుడది పాత మాట అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేరుగా హీరోలుగానే తమ సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. ఒరిజినల్ కాకపోయినా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తూ క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మరో మలయాళం యాక్టర్ టాలీవుడ్ లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో డబ్బింగ్ సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు అదే బాటలో తెలుగులో అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేయబోతున్నాడు మలయాళం స్టార్ నివిన్ పాలీ. నిజంగానే త్వరలో నివిన్ అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నివిన్ పాలీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమమ్ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేసాడు అక్కినేని హీరో నాగచైతన్య. కానీ ఈసారి ఎవరూ రీమేక్ చేసుకునే ఛాన్స్ లేకుండా తానే స్వయంగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేస్తున్నాడట. బ్లాక్ బస్టర్ టర్నింగ్ మూవీ ఇచ్చిన ప్రేమమ్ మేకర్స్ నివిన్ తో మరో సినిమా ప్లాన్ చేశారట. ఆ సినిమాను ఈసారి మలయాళంతో పాటు నేరుగా తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్.

అందుకోసమే ఇదివరకు మలయాళం మేకర్స్ ఈ సినిమా కోసం తెలుగు నటినటులను కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి ఈ మధ్యకాలంలో మన తెలుగు యాక్టర్స్ వేరే భాషల్లో.. వేరే యాక్టర్స్ మన సినిమాల్లో ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. త్వరలోనే మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండగా.. ఇప్పుడు నివిన్ పౌలీ ఎంట్రీ పై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైతే రూమర్స్ గా వినిపిస్తున్న ఈ హీరో డెబ్యూ పై త్వరలోనే క్లారిటీ రానుందేమో చూడాలి.