Begin typing your search above and press return to search.

బాహుబలి పాత్ర చేసి ఉండేదాన్ని

By:  Tupaki Desk   |   21 Sept 2017 11:17 AM IST
బాహుబలి పాత్ర చేసి ఉండేదాన్ని
X
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. బాలీవుడ్ లో సైతం ఆ సినిమా రికార్డు సాధించింది. అక్కడి తారలు కూడా సినిమాలోని పాత్రలను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికి జనాల మనసుల్లో బాహుబలి పాత్రలు ఇంకా అలా మెదులుతూనే ఉన్నాయి. అయితే జై లవకుశ భామ నివేదా థామస్ కూడా బాహుబలి గురించి స్పందించింది.

ఆ సినిమాల్లో నీకు ఏ పాత్ర ఇష్టం.. అలాగే ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఏ పాత్ర ఒకే చేసి ఉండేవారు అన్న ప్రశ్నకు అమ్మడు ఎవరు ఊహించని విధంగా సమాధానం చెప్పింది. ఏ మాత్రం సందేహించకుండా "బాహుబలి" పాత్ర చేస్తాను అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. రీసెంట్ గా జై లవకుశ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నివేదా ఈ విధంగా సమాధానం ఇచ్చింది. సాధారణంగా ఎవరైనా హీరోయిన్ ని అడిగితే అందులో అవంతిక - దేవసేన పాత్రలను చేయాలని ఉందని చెబుతారు..ఇక అవి రెండూ కాకుంటే.. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రల్లో నటించాలని ఉందని చెబుతారు.

కానీ నివేద మాత్రం బాహుబలి అనడం చూస్తుంటే ఆమె ఒక అభిమానిలా ఆ సినిమాను ఎంజాయ్ చేసిందని చెప్పవచ్చు. ఇక రాజమౌళి గారి సినిమాలను బాహుబలి తెరకెక్కించక ముందు నుంచి చూస్తున్నట్లు తెలిపింది. ఇక ఎలాంటి పెళ్లి కొడుకు కావాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగితే.. ఇప్పుడు దాని గోల ఎందుకు నాకు కేవలం 21 సవత్సరాలే అని నవ్వుతూ.. చెప్పింది.