Begin typing your search above and press return to search.

హైదరాబాదులోనే హీరోయిన్ చదువు

By:  Tupaki Desk   |   9 Oct 2017 6:21 AM GMT
హైదరాబాదులోనే హీరోయిన్ చదువు
X
టాలీవుడ్ లో లేటెస్ట్ కథానాయికలు వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. మొన్నటి వరకు ఇతర బాషలనుండి టాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ముద్దు గుమ్మాలు చాలా వరకు ఒకటి లేదా రెండు సినిమాలోతో ఆకట్టుకునే వారు కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు ఒక్క హిట్ రాగానే చాలా ఫెమస్ అవుతున్నారు. ఇపుడు అదే స్థాయిలో వరుస హిట్స్ అందుకున్న నివేత థామస్ కూడా మంచి ఆధారణని దక్కించుకుంటోంది.

జెంటిల్ మెన్ - నిన్ను కోరి వంటి లవ్లీ హిట్స్ అందుకొని ఏకంగా ఎన్టీఆర్ సరసన ఛాన్స్ దక్కించేసుకుంది. జై లవకుశ లో నటించి మంచి మార్కులనే కొట్టేసింది. అయితే రీసెంట్ గా నివేత ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతానికి సినిమా కన్నా ముందు నాకు చదువు ముఖ్యం. హైదరాబాద్ లో ఎంతో ఇష్టంగా ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్నాను. అది పూర్తయ్యాక సినిమాలపై దృష్టి పెడతా. ప్రస్తుతానికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తా.. ఇక్కడ మరిన్ని హిట్స్ అందుకొని బాలీవుడ్ కి వెళ్లడమే నా గోల్ అని వివరించింది.

అంతే కాకుండా తనకు కమల్ హాసన్ - ప్రియాంకా చోప్రా చాలా ఇష్టమని తెలుపుతూ..టాలీవుడ్ లో నాని చాలా ఇష్టమని తెలిపింది. అలాగే మిగతా హీరోలు కూడా చాలా ఇష్టమని చెప్పింది. ఇక విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని చిన్నప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చేదాన్ని. నిన్ను కోరి సినిమా షూటింగ్ ఆర్కే బీచ్ లో జరిగింది. ఎప్పుడు అక్కడికి వెళ్లినా ఒక నాలుగైదు రోజులు ఉంటానని నివేత తెలియజేశారు.